హీరో విజయ్ కూతురు టాలెంట్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యం.. ఏం జరిగిందంటే?
తమిళనాడులో హీరో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో వరుస విజయాలు, రూ. 200 కోట్ల రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళుతున్నాడు. విజయ్ కుమారుడు సంజయ్ కూడా ఇదే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
అయితే విజయ్ కూతురు దివ్య సాషా మాత్రం క్రీడా రంగంలో తన టాలెంట్ నిరూపించుకుంటోంది. ప్రస్తుతం సాషా చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. ఈ పాఠశాలకు సంబంధించిన ఫేస్ బుక్ పేజీలో ఆ స్కూల్ బ్యాడ్మింటన్ టీమ్ ఫోటో షేర్ చేశారు. ఇటీవల జరిగిన టోర్నీలో ఈ టీమ్ టాప్ 3 పొజిషన్ దక్కించుకుందట. ఈ టీమ్‌లో సాషా కూడా ఉండటం చర్చనీయాంశం అయింది.

విజయ్ అభిమానుల హర్షం
ఆ బ్యాడ్మింటన్ టీమ్‌లో సాషా ఉండటంతో విజయ్ అభిమానులు లైక్స్, కామెంట్లతో ముంచెత్తారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఆ స్కూలు పేజీని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది.

మా టీమ్ అదరగొట్టింది
మా స్కూల్ బ్యాడ్మింటన్ టీమ్ ఇటీవల జరిగిన టోర్నీలో అదరగొట్టింది. మా స్కూలు చరిత్రలో ఈ టోర్నీ స్వీట్ మెమొరీగా నిలిచింది అంటూ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ చెన్నై వారు తమ ఫేస్ బుక్ పేజీలో సాషా అండ్ టీమ్ ఫోటోలు షేర్ చేశారు.

దివ్య సాషా
దివ్యసాషా పెద్దయ్యాక ప్రొఫెషనల్ బ్యాడ్మింట్ ప్లేయర్ అవుతుందో? లేక తన తండ్రి ఏలుతున్న తమిళ సినిమా రంగం వైపు వస్తుందా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే విజయ్ కుమారుడు సంజయ్ మాత్రం సినిమా రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకున్నాడు.

విజయ్
విజయ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాదే ఈ మూవీ రానుంది. విజయ్ నటించిన గత చిత్రం‘సర్కార్' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











