కాజల్ పై మీడియా వద్ద మండిపడ్డ స్టార్ హీరో తండ్రి
చెన్నై: 'కాజల్ అన్ ప్రొఫిషనల్ యాటిట్యూడ్ వల్ల మేం చాలా నష్ట పోయాం. విడుదల తేదీలు కూడా మార్చుకోవాల్సి వస్తోంది. ఆమెను మా చిత్రం షూటింగ్ కోసం ఎన్నో సార్లు ఫోన్ చేసాం. ఫోన్ కూడా ఎత్తేది కాదు. అలాంటి వాళ్లను పెట్టుకున్నందుకు భలే బుద్ది చెప్పింది... ,' అంటూ తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్ర శేఖర్ మండిపడ్డారు. కాజల్..తాజాగా తమిళంలో విజయ్ చిత్రం తుపాకి లో చేస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 9న విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు నవంబర్ 13కి విడుదల తేదీకి మార్చాల్సి వచ్చింది. దాంతో ఈ చిత్రం ధియోటర్స్ సైడ్ నుంచి సమస్య వస్తుందని, ఇదంతా కాజల్ వల్లనే వచ్చిందని ఆయన సీరియస్ అవుతున్నారు.
కాజల్..సూర్యతో చేసిన బ్రదర్శ్ చిత్రానికి డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తూ ఈ తుపాకీ చిత్రాన్ని నిర్లక్ష్యం చేసారని ఆమెపై అభియోగం. ఇక తాజాగా వస్తున్న 'తుప్పాక్కి'లో తొలిసారిగా విజయ్ స్కైప్ హెయిర్‌స్త్టెల్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా గాగూల్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నాడు. చేతిలో గన్ పట్టినా అందంగా కనిపిస్తూ అలరిస్తున్నాడు. అంతేకాకుండా చిత్ర ట్రైలర్‌లో కనిపించిన అతని మాటలు కూడా నేటి ట్రెండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దఫాల్లోనూ విజయం సాధించిన విజయ్.. ఇప్పటి స్త్టెల్‌తో మరెన్ని విజయాలు సాధిస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు అభిమానులు.
విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, కెమెరా: సంతోష్ శివన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.


Click it and Unblock the Notifications











