twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast దర్శకుడు నెల్సన్‌ కుమార్‌పై విరుచుకుపడ్డ విజయ్ తండ్రి.. మూవీ ఫ్లాప్‌పై దారుణంగా విమర్శలు

    |

    తమిళ దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం కనీస అంచనాలను చేరుకోలేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. బాక్సాఫీస్ వద్ద బీస్ట్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంపై దర్శకుడు నెల్సన్‌పై అభిమానులే కాకుండా విజయ్ తండ్రి, తమిళ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించాడు. ప్రస్తుతం విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు తమిళ మీడియాలోను, జాతీయ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల తమిళ ఛానెల్‌తో చంద్రశేఖర్ మాట్లాడుతూ..

    బీస్ట్ సినిమా సబ్జెక్ట్, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దారుణంగా విఫలమయ్యాడు. విజయ్ స్టార్‌డమ్‌ను పణంగా పెట్టాడు. నెల్సన్ తన తొలి సినిమాలో మంచి కంటెంట్, టెక్నాలజీ, మేకింగ్‌తో రాణిచాడు. తన రెండో సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్నాడు. కానీ సూపర్‌స్టార్‌తో భారీ ప్రాజెక్టులు చేసే సమయంలో యువ దర్శకులు కనీస విషయాలు ఆలోంచాలి. స్టార్ హీరోల డేట్స్ ఉన్నాయి కదా అని ఏది పడితే అది తీయకూడదు కదా అని చంద్రశేఖర్ ఘాటుగా స్పందించాడు.

    Vijays father SA Chandrasekhar criticises Director Nelson Kumar over Beast disaster

    బీస్ట్‌లో విజయ్ రాఘవన్ అనే రా ఏజెంట్ పాత్రలో విజయ్ నటించాడు. ఈ పాత్రను డిజైన్ చేసేటప్పుడు కథ గురించి రీసెర్చ్ చేయాలి కదా. కాస్త సమయం తీసుకొని.. కథను సిద్దం చేసుకోవాలి. అంతే కానీ.. తొందరగా.. అదరాబాదరగా సినిమా చేయకూడదు అని అని చంద్రశేఖర్ అన్నారు. మంచి స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కథలో లోపాలు ఉన్నా.. వాటిని పట్టించుకోరు. బీస్ట్ సినిమా స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా ఉంది అంటూ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించాడు.

    ఏప్రిల్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ చిత్రం రిలీజ్ తర్వాత ప్రేక్షకులు, విజయ్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడంతో తొలి రోజు తర్వాత కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. ఈ చిత్రం వారం రోజుల్లో 140 కోట్ల ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Vijay's father SA Chandrasekhar responded on Beast movie failures. He targetted Director Nelson Kumar over Beast disaster. He said, Why so much hurry while making movie with with Superstar .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X