సర్కార్‌తో భారీ నష్టాలు.. వివాదంగా ఇంటర్వ్యూ.. విజయ్ తీసుకున్నది ఎంతో చెప్పేశాడు!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. సుమారు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తున్నట్టు ట్రేడ్ రిపోర్టులు ఢంకా మోగిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా సర్కార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అని ఓ ఇంటర్వ్యూలో డిస్టిబ్యూటర్ చెప్పిన విషయాలు ట్రేడ్ అనలిస్టులను, మీడియాను కంగు తినిపించాయి. ప్రస్తుతం డిస్టిబ్యూటర్ ఇంటర్వ్యూకు య్యూట్యూబ్‌లో ఆకట్టుకొంటున్నది. అయితే డిస్టిబ్యూటర్ చెప్పిన మాటలను ఖండిస్తూ అతడి భాగస్వామే లాభాలు వచ్చాయని చెప్పడం వివాదంగా మారింది. ఇంతకీ ఏమైందంటే..

బాక్సాఫీస్ వద్ద బోల్తాతో
చెన్నైలో జీకే సినిమాస్ భాగస్వామి జెయవీరన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు లేక సర్కార్ సినిమా బోల్తాపడింది. చెంగల్పట్టు డిస్టిబ్యూటర్ భారీగా నష్టాల్లో పడ్డారు. సన్ పిక్చర్స్ అతడికి నష్టాలను పూడుస్తామని మాటిచ్చారు వెల్లడించారు.

తొలి వారాంతం తర్వాత
తొలివారాంతం తర్వాత సర్కార్ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. థియేటర్లలో జనం లేక థియేటర్ల ఓనర్లు తంటాలు పడ్డారు. మెర్సల్ విషయంలో ఎగ్జిబిటర్లకు ఇదే పరిస్థితి ఎదురైంది. సర్కార్ సినిమా కూడా ఇదే అనుభూతిని మిగల్చడంతో నష్టాలు చెల్లించే డీల్ వారి మధ్య జరిగింది.

విజయ్ ఊపు కొనసాగలేదు
తొలివారాంతంలో లాభాలు వచ్చినా అజిత్, విక్రమ్ సినిమాల మాదిరిగా విజయ్ ఊపును కొనసాగించలేకపోయాడు. సర్కార్ సినిమాకు విజయ్ రూ.50 కోట్లు తీసుకొన్నాడు. మెర్సల్ సినిమాతో నష్టాల్లో పడిన డిస్టిబ్యూటర్లను ఆదుకొనే ప్రయత్నం చేయలేదు అని పేర్కొన్నాడు.

మాకు లాభాలు వచ్చాయని
జీకే సినిమాస్‌కు చెందిన మరో భాగస్వామి రుబన్ మాతివనన్ మాట్లాడుతూ.. మాకు సర్కార్ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది. సర్కార్ సినిమా మాకు విజయాన్ని తెచ్చిపెట్టింది. పబ్లిసిటీ కోసం మా భాగస్వామి తన ఇంటర్వ్యూలో తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చు అని అన్నారు.


Click it and Unblock the Notifications











