»   » స్టార్ హీరో విజయ్ సినిమాకు....ఆ దుర్మార్గుడికి లింకా?

స్టార్ హీరో విజయ్ సినిమాకు....ఆ దుర్మార్గుడికి లింకా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తుపాకి లాంటి విజయవంతమైన హిట్ చిత్రం తర్వాత తమిళ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'కత్తి'. ఈ చిత్రానికి ఇపుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా ఉన్న లైకమోబీలీకి, శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేకు వ్యాపార సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం.

రాజపక్సే తనయుడు నమల్, లైకమోబిలీ కలిసి యూరఫ్‌లో ఓ కంపెనీ రన్ చేస్తున్నారు. శ్రీలంకలో తమిళులను ఊచ కోత కోసిన రాజపక్సే అంటే తమిళ ప్రజలకు అస్సలు పడదు. రాజపక్సేను తమ జాతికి ఒకశత్రువుగా, అతన్నొక దుర్మార్గుడిగా పరిగణిస్తారు తమిళ ప్రజలు.

Vijay's Kaththi faces trouble

ఈ నేపథ్యంలో 'కత్తి' సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు తప్పవనే వార్తలు తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయ్ నటించిన 'తలైవా' సినిమా గతంలో వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం విడుదల పెద్ద సమస్యగా మారింది. అపుడు తలైవా విడుదల ఆగిపోవడానికి పలు రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉంది.

విజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని రాజకీయ పక్షాలకు ఇపుడు రాజపక్సే లింకు ఉన్న అంశం ఆయుధంగా మారినట్లయింది. దీంతో వారు విజయ్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary

 Vijay, who is now starring in A.R. Murugadoss-directed Kaththi, faces trouble yet again as it now turns out that the film’s co-producer Lycamobile,is the business partner of Lankan president Rajapakse, easily the most hated person in Tamil Nadu. Rajapakse’s son Namal is the co-partner in Lycamobile, a popular company in European countries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu