కత్తిలాంటి ప్లాన్... 150 కోట్లు టార్గెట్
చెన్నై: బాలీవుడ్ లోనే కాదు... దక్షిణాదిలోనూ మార్కెట్ భారీగా పెరిగింది. విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తుపాకి' ఏకంగా రూ. 130 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కత్తి'ని రూ.150కోట్లపై టార్గెట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ దశలోనే 'కత్తి' సినిమాపై విపరీతమైన బిజినెస్ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముకేష్ విలన్‌గా నటించారు.
ఇలయ తలబది విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కత్తి'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. ఆగస్టు 10వ తేదీలోపు పూర్తి చేయనున్నట్లు సమాచారం. తొలిసారిగా విజయ్ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటికోసం యూనిట్ వచ్చేవారం ఐరోపా వెళ్లనుంది. వారంపాటు అక్కడ షూటింగ్ జరుపనున్నారు. ఆ తర్వాత ఆడియో విడుదల తేదీని ప్రకటించనున్నారు. లికా ప్రొడక్షన్స్ బ్యానరుపై కరుణామూర్తి, సుభాష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానున్నట్లు సమాచారం. మరోవైపు ఆడియో విడుదల కార్యక్రమాన్ని మదురైలో అభిమానుల నడుమ భారీఎత్తున నిర్వహించేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'తుప్పాక్కి' తర్వాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్.


Click it and Unblock the Notifications











