విజయ్ ఫ్యాన్స్‌కు షాక్.. నెటిఫ్లిక్స్ చేతికి మాస్టర్.. థియేటర్‌ రిలీజ్ డౌటే!

కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రం అభిమానులను ఊరిస్తున్నది. కొద్ది నెలుగు దక్షిణాది సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజ్ కావడానికి ముస్తాబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ సినిమాను థియేటర్‌లో విడుదలైతే ఈల వేసి గోల చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఓటీటీలో రావడం అభిమానులకు కాస్త నిరాశపరిచే విషయంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో మాస్టర్ మూవీ

ఓటీటీలో మాస్టర్ మూవీ

వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్‌తో జతకట్టిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ మాస్టర్ చిత్రాన్ని ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. గత ఏప్రిల్‌లోనే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే చిత్రాన్ని జనవరి 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్ రైట్స్

నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్ రైట్స్

తమిళ మీడియా కథనాల ప్రకారం.. సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్ కుమార్ మాస్టర్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్ అమ్మారు. భారీ రేటుకు ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా థియేటర్లలో వచ్చే అవకాశం లేదనే విషయం స్పష్టమైంది.

అధికారికంగా వెల్లడించకపోవడంతో

అధికారికంగా వెల్లడించకపోవడంతో

అయితే మాస్టర్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ అమ్మినట్టు చిత్ర యూనిట్ వర్గాలు కూడా ఈ వార్తను ధృవీకరించాయి. కానీ అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా బయటకు వెల్లడించకపోవడంపై కొంత సందిగ్ధత నెలకొన్నది. త్వరలోనే ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్, మాస్టర్ నిర్మాతలు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Recommended Video

Middle Class Melodies Team Interview Part 8
విజయ్ కెరీర్‌లో 64వ చిత్రంగా

విజయ్ కెరీర్‌లో 64వ చిత్రంగా

మానగరం ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో జేవియర్ బ్రిట్టో నిర్మాతగా మాస్టర్ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో విజయ్, మాళవిక జంటగా నటించారు. విజయ్ సేతుపతి, ఆండ్రియా జెర్మియా, శంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో 64వది కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X