100కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేయటం ఖాయం
మా చిత్రం వందకోట్లు కలెక్షన్స్ ని గ్యారెంటీగా క్రాస్ చేస్తుంది అంటున్నారు నన్బన్ చిత్రం నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా శంకర్ తాజా చిత్రం నన్బన్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఈ చిత్రం ఇప్పటికే రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిందని,గ్యారెంటీగా వందకోట్లుని క్రాసి చేసి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని నిర్మాతలు జెమినీ వారు ధీమాగా చెప్తున్నారు. వారు ఎప్పటికప్పుడు కలెక్షన్స్ ప్రకటిస్తూనే ఉన్నారు. మొదటి మూడు రోజుల్లోనే 57 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని వారు ప్రకటించారు. అక్కడ మీడియోలో అదొక హాట్ టాపిక్ గా మారింది. కేవలం పన్నేటు కోట్లు మాత్రమే వచ్చాయని,దాన్ని దాచిపెట్టి వారు 57 కోట్లు వచ్చాయని అబద్దమాడుతున్నారని ఆరోపించారు. అయితే వీరు అవేమి పట్టించుకోవటం లేదు. తాము డబ్బు లెక్కలు ఎక్కువ చేసి చెప్పాల్సిన పనేమి లేదని అంటున్నారు.
తమిళనాడులో ఏ థియేటర్ కి వెళ్లినా హౌస్ ఫుల్ బోర్డ్ తో తమ సినిమా కనపడుతుందని,అది చాలు తాము చెప్పేది నిజమని నమ్మటానకి అని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో డబ్బింగ్ చేసి అందిస్తున్నారు. 'త్రీ ఇడియట్స్' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి డబ్బింగ్ టైటిల్ గా 'స్నేహితుడు'అని పెట్టారు. స్నేహితుడు చిత్ర గీతాల్ని ఈ నెల 19న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. హారీస్ జైరాజ్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 26న చిత్రం విడుదలవుతుంది. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించింది. విజయ్, ఇలియానా జంటగా నటించారు. జీవా, శ్రీరామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











