twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాను నిషేదించాల్సిందే..వివాదం ముదురుతోంది

    By Srikanya
    |

    విల్లివాక్కం: ఇళయ దళపతి విజయ్‌ నటించిన కత్తి' సినిమా ప్రదర్శనను నిషేధించాలని కోరుతూ తమిళగ వాల్వురిమై కట్చి తరపున పోలీసు కమిషనర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఆ పార్టీ కన్వీనర్‌ వేల్‌మురుగన్‌ నేతృత్వంలో 50 మంది పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. గత కొద్ది నెలలుగా ఈ వివాదం సాగుతోంది. ఎక్కడా దీనికి ముగింపు కనపడటం లేదు. దీంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. చర్చలతో ఈ వివాదం పరిష్కరించాలని ప్రయత్నించాలని పరిశ్రమలోని పెద్దలు అంటున్నారు.

    కన్వీనర్ వేల్‌మురుగన్‌ మాట్లాడుతూ.. నటుడు విజయ్‌ నటించిన కత్తి సినిమాను శ్రీలంకకు చెందిన లైకా సంస్థ నిర్మించిందని తెలిపారు. ఈ సినిమా దీపావళికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారని, దీనిని నిషేధించాలని వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. లైకా సంస్థ తమిళులను వూచకోత కోసిన రాజపక్సేకు చెందిన సంస్థ అని పేర్కొన్నారు.

    Vijay's new movie ‘Kathi’ in trouble

    కాగా గతంలోనూ విజయ్ నటించిన 'తలైవా' చిత్రాన్ని కూడా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కత్తి చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. లికా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై కరుణామూర్తి, సుభాష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు.

    ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

    English summary
    Ilayathalapathi's upcoming film 'Kathi' is facing several troubles in the current scenario for the connection of the production company .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X