‘ఈగ’ఫేమ్ సుదీప్ విలన్ గా చిత్రం ఖరారు
చెన్నై: 'ఈగ' చిత్రం హిట్ కావటంతో కన్నడ హీరో సుదీప్ కు తెలుగు,తమిళ భాషల్లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన్ను పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ కు అడుగుతున్నారు. ఈ నేఫధ్యంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా చేయనున్న యోహాన్ అధ్యాయం ఒండ్రు చిత్రంలో హీరోగా ఎంపిక చేసారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో త్వరలో షూటింగ్ మొదలు కానుంది.
ఈ చిత్రంలో ఇళయదళపతి విజయ్ సరసన పొడుగు కాళ్ల సుందరి సమీరారెడ్డి నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ మీనన్, విజయ్ కాంబినేషన్‌లో యోహాన్ అధ్యాయం ఒండ్రు అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తన ఆస్థానసమీరాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు భోగట్టా. సమీరారెడ్డిని వారణం ఆయిరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసింది గౌతమ్ మీనన్ అనే విష యం విదితమే. తరువాత నడునిశి నాయ్‌గళ్ చిత్రంలోను సమీరానే హీరోయిన్. ఇప్పు డు మరోసారి ఆమెకు బ్రేక్ ఇవ్వాలని గౌతమ్ భావించినట్లు సమాచా రం.
ప్రస్తుతం ఆయ న నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జీవా, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలోనూ ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో నాని హీరోగాను, హిందీలో ఆదిత్యరామ్ హీరోగాను నటిస్తున్నారు. ఈ మూడు భాషలలోనూ సమంత హీరోయిన్ కావడం విశేషం. విన్నైతాండి వరువాయా హిందీ వెర్షన్ చిత్రంలోను బిజీగా ఉన్న గౌతమ్, విజయ్‌తో తెరకెక్కించే యోహాన్ అధ్యాయం ఒండ్రు చిత్రా న్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది
మరో ప్రక్క ఈగతో వచ్చి క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగై దిగుతున్నాయి. కన్నడ దర్శకుడు గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి వదులుతున్నారు. 'ఈగ' ఫేమ్ సుదీప్ హీరోగా గురుదత్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'కిచ్చ ఖుచ్చా'. ఈ సినిమా 'కిచ్చా' పేరుతో తెలుగులో విడుదల కానుంది. 'పక్కా మాస్' అనేది ట్యాగ్ లైన్. అరిగెల కిషోర్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











