For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ 'పులి' సెట్లో...జరిగిందేమిటంటే...(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: విజయ్‌, శ్రీదేవి, శ్రుతిహాసన్‌, హన్సిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'పులి' చిత్రం తమిళ్‌ మేకింగ్‌ వీడియో విడుదలైంది. చిత్ర యూనిట్ తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ వీడియో లింక్‌ను పోస్ట్‌ చేశారు. చింబు దేవన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.అక్టోబర్‌ 1 'పులి' ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.

    తమిళ స్టార్ హీరో విజయ్‌, శ్రుతిహాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు.

    విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘పులి' ఇటీవల విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆలస్యంగా విడుదలైన ఈ సినిమాకు వెంటనే నెగెటివ్ టాక్ రావడం మరో పెద్ద షాక్. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సైతం ఇలాంటి సినిమా విజయ్ ఎలా ఒప్పుకున్నాడని ఆశ్చర్య పోతున్నారు. పరిస్థితి చూస్తుంటే సినిమా నిర్మాతలకు భారీ నష్టాల తప్పేలా లేవు. తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Vijay's Puli making video

    అయితే తమిళ స్టార్ రజనీకాంత్‌ మాత్రం ఈ సినిమా చాలా బావుందంటూ ప్రశంసించారు. విజయ్ పెర్ఫార్మెన్స్‌పై, శ్రీదేవి యాక్టింగుపై పొగడ్తలు గుప్పించారు. ఈ విషయాన్ని పులి నిర్మాతలు మీడియాకు వెల్లడించారు. ‘పులి' సినిమాను ఓ స్పెషల్ షో వేయించుకుని రజినీ చూశారని, ఫాంటసీ యాక్షన్ మీద నమ్మకంగా అంత ఖర్చు పెట్టినందుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తమను అభినందించారని.. ఈ మూవీతో సౌత్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికి అభినందనలు తెలపాల్సిందిగా చెప్పారని ఎస్కేటీ స్టూడియోస్ ట్విట్టర్ లో వెల్లడించింది. మరో వైపు హీరోయిన్ తమన్నా కూడా ఈ సినిమాపై, విజయ్ పెర్మెన్స్‌పై ప్రశంసలు గుప్పించింది. తమిళ యాక్టర్ జయం రవి, మరో తమిళ నటుడు జీవ తదితరులు పులి సినిమాపై, విజయ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నారు. ఓ వైపు నెగెటివ్ టాక్, మరో వైపు స్టార్ల ప్రశంసలు....పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందో చూడాలి.

    English summary
    Ilayathapathy Vijay’s socio- fantasy film, Puli making video released. Puli making video is nothing short of stunning. You will be amazed to see the scale in which Vijay-Shruti Haasan starrer has been shot. From set designers to costume sketchers to VFX team, the video gives us a behind the scene insight of how Puli was made. You will be awestruck by the way these huge sets were erected with patches of green and blue screen here and there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X