చరిత్ర సృష్టిస్తున్న విజయ్.. ఎన్ని దేశాల్లో సర్కార్ రిలీజ్ అవుతుందో తెలుసా? అమీర్‌ఖాన్‌కే దడ!

తమిళ దళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్రం విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తున్నది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. తమిళ చిత్ర పరిశ్రమలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున్న, ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే..

80 దేశాల్లో రిలీజ్

విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. సుమారు 3 వేల స్క్రీన్లకుపైగా రిలీజ్ అవుతున్నది. దాదాపు 80 దేశాల్లో విడుదల కానున్నది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

అమీర్ ఖాన్ సినిమాకు పోటీ

అమీర్ ఖాన్ సినిమాకు పోటీ

జాతీయ, అంతర్జాతీయంగా అమీర్‌ఖాన్‌ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రానికి గట్టిపోటి ఇచ్చే అవకాశం ఉంది. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం హంగామా చేయడానికి ఛాన్స్ ఉంది అని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

సుందర్ పిచాయ్ జీవితం ఆధారంగా

సుందర్ పిచాయ్ జీవితం ఆధారంగా

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితం ఆధారంగా సర్కార్ చిత్రం తెరకెక్కిందనే మాట వినిపిస్తున్నది. విజయ్ పోషించిన పాత్రకు పిచయ్ స్ఫూర్తి. సర్కార్ చిత్రంలో విజయ్ అమెరికాలో నివసించే ఎన్నారైగా నటించాడు. అమెరికా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు అనేది సర్కార్ సినిమా కథ.

తమిళనాడు రాజకీయాల్లో

తమిళనాడు రాజకీయాల్లో

ప్రస్తుతం తమిళనాడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సినిమాల్లో చూపించినట్టు సమాచారం. సర్కార్ క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనేక ట్విస్టులు, మలుపులు ఉంటాయి. ప్రేక్షకుడిని సీట్లకు హత్తుకుపోయి చేసేలా ఉంటుందనే సినీ వర్గాల టాక్.

 విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో

విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో

కత్తి, తుపాకి చిత్రాల తర్వాత విజయ్‌తో మురగదాస్ తీస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్‌గా నటించారు. కీర్తీ సురేష్ గ్లామర్ పాత్రలో విజయ్ సరసన కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X