twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఏరియా రైట్స్ ఇవ్వలేదని.... స్టార్ హీరో సినిమాపై ప్రతీకారం!

    |

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' మూవీ ఒక్కో ఇబ్బందిని దాటుకుంటూ ఈ నెల 6న థియేటర్లలోకి వస్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    ఆకు రౌడీగా ధనుష్.. ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన మారి2ఆకు రౌడీగా ధనుష్.. ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన మారి2

    తమిళనాడులో విజయ్ ఫాలోయింగ్‌కు తగిన విధంగా 700 స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఆ రాష్ట్రంలో ఏజీఎస్ ఎంటర్టెన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో రన్ అవుతున్న స్క్రీన్లలో మాత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లేదట.

    ఆ ఏరియా రైట్స్ ఇవ్వలేదు

    ఆ ఏరియా రైట్స్ ఇవ్వలేదు

    అయితే ఏజీఎస్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతల్లో ఒకరైన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కాల్పతి అఘోరామ్.... తమిళనాడులోని చంగల్‌పేట ఏరియా ‘సర్కార్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ప్రయత్నించారు. అయితే సన్ పిక్చర్స్ సంస్థ అతడికి రైట్స్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తమిళ పత్రిక కథనం.

    ప్రతీకారంగానే ఇలా చేస్తున్నారా?

    ప్రతీకారంగానే ఇలా చేస్తున్నారా?

    తనకు చంగల్‌పేట ఏరియా రైట్స్ ఇవ్వక పోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజీఎస్ స్క్రీన్లలో సర్కార్ సినిమాను ప్రదర్శించడానికి అతడు నిరాకరిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాలని అతడితో చర్చలు జరుపుతున్నారట.

    విజయ్ సినిమాకు నెక్ట్స్ నిర్మాతలు కూడా వారే

    విజయ్ సినిమాకు నెక్ట్స్ నిర్మాతలు కూడా వారే

    విజయ్ నటించబోయే తర్వత సినిమాను నిర్మించబోయేది కూడా ఎజీఎస్ ఎంటర్టెన్మెంట్స్ వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సినిమా రిలీజ్ సమయానికి అంతా సెట్టవుతుందని అంటున్నారు.

    సర్కార్ భారీ అంచనాలు

    సర్కార్ భారీ అంచనాలు

    ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘సర్కార్' చిత్రాన్ని సన్ పిక్చర్స్ బేనర్లో కళానిధి మారన్ నిర్మించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తుపాకి, కత్తి తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ముఖ్య పాత్రల్లో...

    ముఖ్య పాత్రల్లో...

    ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా... వరలక్ష్మి శరత్‌కుమార్, రాధారవి, అర్జున్ సార్జా, ప్రేమ్ కుమార్, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    According to a report by Tamil daily Dinamalar, the Vijay-starrer Sarkar may not be screened in any of the AGS screens across the state. Chennai fulm source said that the Kalpathi Aghoram’s AGS refused the Chengalpet rights of the film following which the distributors are now against screening the film in their theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X