విజయ్ ‘సర్కార్’ టీజర్ సంచలనం, యూట్యూబ్ దద్దరిల్లేలా...
Recommended Video

తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతునక్న 'సర్కార్' టీజర్ విజయదశమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం విడుదలైంది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్, సోషల్ మీడియా దద్దరిల్లిపోయేలా చేసింది. ఒక్క యూట్యూబ్‌లోనే 12 గంటల్లో 11 మిలియన్లకుగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో పాటు రికార్డ్ స్థాయి 5 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ వచ్చాయి.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్, రాధారవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.

కార్పొరేట్ రాక్షసుడు
‘సర్కార్' చిత్రంలో విజయ్ కార్పొరేట్ మాన్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. టీజర్లో వరలక్ష్మి వాయిస్‌తో విజయ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ‘అతడు కార్పొరేట్ రాక్షసుడు, తనకు పోటీగా ఉన్న వారిని నాశనం చేసే వరకు ఏదేశాన్ని వదల్లేదు. ఇపుడు అతడు ఇండియా వచ్చాడు' అంటూ స్టైలిష్‌గా విజయ్ ఎంట్రీ చూపించారు.

వచ్చింది అందుకు కాదు
ఇండియాలో నేను ఏ కంపెనీ కొనుగోలు చేయడానికి రాలేదు. ఈ రోజు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను నా ఓటు వేయడానికి వచ్చాను.... అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధానం ఇవ్వడం టీజర్లో చూడొచ్చు.

ఆ సంఘటనతో సంచలన నిర్ణయం
అయితే ఓటు వేయడానికి వెళ్లిన హీరో విజయ్... తన ఓటు మరొకరు వేశారని తెలుసుకుని షాకవుతాడు. ఇక్కడి పరిస్థితులను, రాజకీయాలను మార్చడానికి సంచలన నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలతో సినిమా ఆసక్తిగా ఉంటుందట.

పొలిటికల్ థ్రిల్లర్
‘‘ఈ చిత్రంలో విజయ్ సుందర్ అనే పాత్రలో కనిపించాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను బేస్ చేసుకుని అతడి క్యారెక్టర్ ఉంటుంది. యూఎస్ఏ నుంచి తమిళనాడు వచ్చిన హైటెక్ సీఈఓ ఇక్కడి వ్యవస్థను ఎలా మార్చాడు అనే కథతో సాగుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి పౌరుడు పొలిటీషన్లను బ్లేమ్ చేసే ముందు తమను తాము ఆత్మపరిశీలన చేసుకుంటారు'' అని దర్శకుడు మురుగదాస్ తెలిపారు.
విజయ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి
విజయ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం అతడి పొలిటికల్ ఆరంగ్రేటానికి ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు సైతం అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











