విజయ్ ‘సర్కార్‌’కు షాక్.. థియేటర్ల వద్ద ఉద్రిక్తత.. ప్రదర్శనల నిలిపివేత..

భారీ అంచనాలతో రిలీజై కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్న సర్కార్ చిత్రానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు అధికార పార్టీ నేతలు, కార్యకర్తల నిరసన ప్రదర్శనలు, ఆందోళనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సినిమాలను నిలిపివేసినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల ఆందోళనలతో పలు ప్రాంతాల్లో డిస్టిబ్యూటర్లు ప్రదర్శనలు రద్దు చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మురుగదాస్‌పై కేసు

మురుగదాస్‌పై కేసు

తమిళనాడు ప్రభుత్వానికి, ఆ పార్టీ సంక్షేమ పథకాలపై దుష్ర్పచారం చేసే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారు అనే అన్నాడిఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో సినిమాపై, దర్శకుడు మురుగదాస్‌పై కూడా కేసు నమోదు చేశారు.

తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో

తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. దాంతో పలు థియేటర్లలో డిస్టిబ్యూటర్లు ప్రదర్శనలను వాయిదా వేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకొన్నది.

మధురైలో మ్యాట్నీ షోలు క్యాన్సిల్

మధురైలో మ్యాట్నీ షోలు క్యాన్సిల్

మధురైలో సర్కార్ సినిమాను ప్రదర్శించే థియేటర్ల ఏఐడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ప్రియ, సాగర్ ప్రియ, మినీ ప్రియ థియేటర్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మ్యాట్ని ప్రదర్శనలను నిలిపివేశారు అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

 రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు

రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు

పలు వివాదాల మధ్య సర్కార్ చిత్రం సంచలనాలను సృష్టిస్తుంది. తొలి రోజు కాలా, బాహుబలి2 సినిమా కలెక్షన్లను అధిగమించింది. గత రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రానున్న రోజుల్లో భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X