వీడియో: స్టార్ హీరో సినిమాకు షాక్, సాంగ్ లీక్.. ఎవరి పనంటే!
Recommended Video

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కత్తి, తుపాకీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సందేశాత్మక చిత్రాలని తెరకెక్కించడంలో మురుగదాస్ కు మంచి పట్టు ఉంది. మరోవైపు మెర్సల్ చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విజయ్ జోరుమీద ఉన్నాడు.

సర్కార్‌కు షాక్
సర్కార్ చిత్ర యూనిట్ కు ఇది షాకింగ్ న్యూస్. ఈ చిత్రంలోని సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో ఫుటేజ్ తీసి లీక్ చేశారు. సాంగ్ లీక్ కు కారణం ఎవరు అని చిత్ర యూనిట్ అన్వేషిస్తోంది.

వేగాస్‌లో షూటింగ్
ఈ చిత్రం ప్రస్తుతం లాస్ వేగాస్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే ఫారెన్ డాన్సర్స్ తో కొరియోగ్రాఫర్ శోభి కంపోజ్ చేసిన సాంగ్ షూటింగ్ జరుగుతుండగా ఈ లీక్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
ఫారెన్ డాన్సర్స్
ఈ సాంగ్ ని షూటింగ్ లో పాల్గొన్న ఫారెన్ డాన్సర్స్ లీక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది.

22వ సారి
సర్కార్ చిత్రానికి ఏదో ఒక రూపంలో లీకేజ్ బెడద వేధిస్తూనే ఉంది. షూటింగ్ ప్రారంభం అయిన్నప్పటి నుంచి ఇప్పటివరకు 22 సార్లు సీక్రెట్ గా ఫుటేజ్ లీకైంది. ఈ సాంగ్ పూర్తయిన తరువాత కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి చిత్ర యూనిట్ ఇండియా తిరిగి రానున్నారు.


Click it and Unblock the Notifications











