»   »  ఇక్కడ తుస్సే... అక్కడ కలెక్షన్లు అదిరిరాయ్, సంబరాలు (ఫోటోస్)

ఇక్కడ తుస్సే... అక్కడ కలెక్షన్లు అదిరిరాయ్, సంబరాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాట హీరో విజయ్ పెద్ద స్టార్... కానీ తెలుగులో మాత్రం ఆయన సినిమాలు పెద్ద ప్లాపుగా నిలిచిపోతూ ఉంటాయి. విజయ్ కెరీర్లో ఇప్పటి వరకు తెలుగు ఓ మోస్తరుగా ఆడిన సినిమా ఏదంటే ఒక్క 'తుపాకి' చిత్రం మాత్రమే. ఆయన మిగతా సినిమాలు తమిళనాడులో హిట్టయినా, తెలుగులో మాత్రం నిరాశనే మిగులుస్తూ వచ్చాయి. తాజాగా విడుదలైన ఆయన తమిళ చిత్రం 'తేరి' తెలుగులో 'పోలీస్' పేరుతో విడుదలైంది. ఈ చిత్రం కూడా తెలుగులో విజయ్ కి మరోసారి నిరాశను మిగిల్చింది.

తమిళంలో 'తేరి' ఘన విజయం సాధించి మంచి వసూళ్లతో దూసుకెలుతోంది. తొలి వీకెండ్ బక్సాపీసు వద్ద దాదాపుగా రూ. 85 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్బులో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అట్లీ దర్శకత్వం వహించిన ఈచిత్రం పలు రికార్డులను బద్దలు కొట్టింది. చెన్నైలో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఉన్న విక్రమ్ 'ఐ' రికార్డును బద్దలు కొట్టింది. 4 డేస్ ఓపెనింగ్ వీకెండ్‌లో చెన్నైలో ఈ చిత్రం రూ. 3.43 కోట్లు వసూలు చేసింది. ఒక్క చెన్నైలో తొలి వారాంతంలో ఇంత భారీ మొత్తం వసూలు కావడం ఇదే తొలిసారి.

ఇక తమిళనాడు వ్యాప్తంగా ఈ చిత్రం తొలి వారాంతం రూ. 35 కోట్లు వసూలు చేసింది. సెకండ్ వీక్ లో కూడా వసూళ్లు స్టీడీగా కొనసాగితే తమిళనాడు బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

తేరి సక్సెస్ పార్టీ

తేరి సక్సెస్ పార్టీ


తేరి సక్సెస్ పార్టీలో యూనిట్ సభ్యులంతా మునిగి తేలారు.

ఓవర్సీస్

ఓవర్సీస్


ఆదివారం వరకు యూఎస్ఏలో ఈచిత్రం నార్త్ అమెరికాలో $ 924,531 [రూ. 6.15 కోట్లు], యూఎస్ఏలో $ 643,353+ కెనడాలో $ 281,178 వసూలు చేసింది.

యూకెలో..

యూకెలో..


యూకెలో ఈ చిత్రం £ 281,485 [రూ. 2.66 కోట్లు] వసూలు చేసింది.

ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా..


ఆస్ట్రేలియాలో $ 305,807 [రూ 1.57 కోట్లు].

మలేషియా

మలేషియా


మలేషియాలో ఈ చిత్రం రూ. 5.25 కోట్లు వసూలు చేసింది.

శ్రీలంక, సింగపూర్

శ్రీలంక, సింగపూర్


శ్రీలంకలో రూ. 2.66 కోట్లు, సింగపూర్ లో రూ. 2.96 కోట్లు సవూలు చేసింది.

యూఏఇ

యూఏఇ


యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రూ. 2 కోట్లు వసూలు చేసింది.

కేరళలో..

కేరళలో..


కేరళలో ఈ చిత్రం రూ. 9.88 కోట్లు వసూలు చేసింది.

ఏపీ-తెలంగాణ

ఏపీ-తెలంగాణ


ఏపీ-తెలంగాణలో ఈ చిత్రం రూ. 4.75 కోట్లు వసూలు చేసింది.

కర్నాటక

కర్నాటక


కర్నాటకలో ఈచిత్రం రూ. 6.12 కోట్లు వసూలు చేసింది.

రెస్టాప్ ఇండియా

రెస్టాప్ ఇండియా


రెస్టాప్ ఇండియాలో ఈచిత్రం రూ. 50 లక్షలు వసూలు చేసింది.

Read more about: vijay విజయ్
English summary
Ilayathalapathy Vijay's latest release Theri is on a money-collecting spree, setting box offices on fire, not only in India but also overseas. With a total collection of 85 Crore rupees (approx) from the worldwide box office in its opening weekend, Theri is all set to hand Vijay yet another movie that belongs to the 100 Crore club.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu