Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
విజయ్ ‘బిగిల్’ లుక్ మాత్రమే కాదు.. రేటు కూడా అదిరిపోయింది!
వరుస విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్న తమిళ స్టార్ విజయ్ ప్రస్తుతం తన 63వ చిత్రం అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా చిత్రానికి 'బిగిల్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ట్రేడ్ సర్కిల్లో ప్రి రిలీజ్ బిజినెస్ హైప్ అయింది.
తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 30 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బిజినెస్. తమిళ సినిమా పరిశ్రమలో పెట్టా, కబాలి తర్వాత ఓవర్సీస్ మార్కెట్లో అత్యధిక మొత్తంలో బిజినెస్ జరిగిన చిత్రం ఇదే.
గతంలో అట్లీ దర్శకత్వంలో విజయ్... తేరి, మెర్సల్ చిత్రాలు చేశారు. ఈ రెండు కూడా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో 'బిగిల్' మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర, మరొకటి ఫుట్‌బాల్ ఆటగాడి పాత్ర అని స్పష్టమవుతోంది. విజయ్ సరసన నయనతార హీరోయిన్. జాకీ ష్రాఫ్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.