సర్కార్‌లో విజయ్ రోల్ ఇదే.. 1919లో అమెరికన్ రచయిత సృష్టి!
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధా రవి వంటి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విజయ్, మురుగదాస్ కాంబోలో తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. సర్కార్ చిత్రం హ్యాట్రిక్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రం చుట్టూ భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆ పాత్ర ఆధారంగా
సర్కార్ చిత్రంలో విజయ్ సాధారణ ప్రజలకు అండగా నిలిచే పాత్రలో నటిస్తునట్లు రాధా రవి తెలిపాడు. విజయ్ పాత్రలో జుర్రో పాత్ర లక్షణాలు ఉంటాయి. అమెరికన్ రచయిత జాన్స్టోన్ 1919 లో జుర్రో పాత్రని సృష్టించారు. ఈ పాత్ర ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి. మాస్క్ ధరించిన వీరుడు సాధారణ ప్రజలకు అండగా నిలిచే పాత్ర అది. సర్కార్ చిత్రంలో విజయ్ పాత్రకు జుర్రో పాత్రకు పోలికలు ఉంటాయని రాధా రవి తెలిపారు.

కళ్ళు చేరిరిలా హీరోయిజం
జుర్రో తరహాలోనే విజయ కూడా సాధారణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ చిత్రంలో హీరోయిజం అద్భుతంగా ఉంటుందని, ఆ విధంగా ఈ చిత్రాన్ని మురుగదాస్ పవర్ ఫుల్ స్టోరీతో తెరేక్కించారని రాధా రవి తెలిపారు.

కత్తిలో రైతు సమస్యలపై
మురుగదాస్, విజయ్ కాంబోలో వచ్చిన చివరి చిత్రం కత్తి. ఈ చిత్రంలో మురుగదాస్ రైతు సమస్యలని ప్రభావవంతంగా చూపించారు. మురుగదాస్ సినిమాల్లో తప్పకూడా సోషల్ మెసేజ్ ఉంటుంది. సర్కార్ చిత్రం కూడా అదే తరహాలో ఉండబోతోంది.

దీపావళికి విడుదల
సర్కార్ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళికి ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. త్వరలోనే ఆడియో వేడుక తేదీ ప్రకటించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











