twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో అయినా స్వయంగా వడ్డించాడు(ఫొటోలు)

    By Srikanya
    |

    చెన్నై : హీరో తాను పనిచేసే యూనిట్ తో కలివిడిగా ఉంటేనే మంచి అవుట్ పుట్ వస్తుందనేది నిజం. ఈ విషయంలో తమిళ హీరో విజయ్ ముందుంటాడు. తాజాగా తాను నటిస్తున్న 'కత్తి' చిత్ర యూనిట్‌కు నటుడు విజయ్‌ విందు ఇచ్చారు. 'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు.

    ఈ నేపథ్యంలో షూటింగ్ ముగియడంతో తన యూనిట్‌కు విజయ్‌ విందు ఏర్పాటు చేశారు. విజయ్‌ కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

    Vijay serving food for the unit members

    ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

    English summary
    Tamil star Vijay and ace filmmaker AR Murugadoss serving food for the unit members on the sets of their upcoming flick 'Kathi'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X