రవ్వంత మంచితనం కూడా ఉండదు.. చాలా దుర్ముర్గుడిని.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్
ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలిగే అతికొద్ది మంది యువ హీరోల్లో విజయ్ సేతుపతి ముందుంటాడు. తన వద్దకు వచ్చిన పాత్రను పదింతలు పెంచేలా నటించే హీరో, నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నాడు. సైడ్ క్యారెక్టర్ అయినా, నెగెటివ్ రోల్ అయినా సరే తనదైన శైలిలో అవలీలగా జీవించేస్తాడు. అందుకే కేవలం తమిళ నాటే కాదు.. మొత్తం దక్షిణాదిలోనూ విజయ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది.

తమిళంలో బిజీగా..
విజయ్ సేతుపతి తమిళంలో ఫుల్ డిమాండ్‌లో ఉన్న హీరో. ఎటువంటి పాత్రైనా సరే ఈజీగా చేసే నటుడు, నెగెటివ్ రోల్‌ను అద్బుతంగా పండించగలగడంతో స్టార్స్ సైతం విజయ్ వైపే చూస్తున్నారు. అందుకే రజినీకాంత్, దళపతి విజయ్ వంటివారు ఏరికోరి మరీ పెట్టుకుంటున్నారు.

విజయ్‌తో విజయ్ ఢీ..
రజినీకాంత్ పేట్టా సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి ఆ పాత్రలో అదరగొట్టాడు. ప్రస్తుతం దళపతి విజయ్‌తో తలపడేందుకు సిద్దమయ్యాడు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న మాస్టర్ చిత్రంలో ఇద్దరు విజయ్‌లు ఢీ కొట్టబోతోన్నారు.

సెల్ఫీ అదుర్స్..
మాస్టర్ షూటింగ్‌లో భాగంగా చివరి రోజున సెట్‌ను వీడి వెళ్లేటప్పుడు విజయ్ సేతుపతి, విజయ్‌కు ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరు దిగిన సెల్ఫీ ఎంతగానో వైరల్ అయింది. ఇక మాస్టర్ ఆడియో ఫంక్షన్ రోజున దళపతి పెట్టిన ముద్దు కూడా ఫుల్ చక్కర్లు కొట్టింది.

మాస్టర్ వాయిదా..
ఒకవేళ కరోనా రాకుండా ఉండుంటే.. ఈపాటికే మాస్టర్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యేవి. కానీ కరోనా వచ్చి మాస్టర్ వేగానికి అడ్డుకట్ట వేసింది. మాస్టర్ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి అప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయా? లేదా? అన్నది చూడాలి.

రవ్వంత మంచితనం ఉండదు..
తాజాగా విజయ్ సేతుపతి మాస్టర్ చిత్రంతో తన పాత్ర స్వభావం గురించి చెప్పుకొచ్చింది. ‘దారుణమైన, ఘోరమైన దుర్మార్గుడిని పాత్రను పోషిస్తున్నాను.. రవ్వంత మంచితనం కూడా ఆ పాత్రలో కనిపించదు. ఆ పాత్రను పోషించడం ఎంతో సంతోషంగా ఉంద'ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











