మణిరత్నం మళ్లీ పాలిటిక్స్.. సంచలనంగా నవాబ్..
Recommended Video

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న దర్శకత్వం మణిరత్నం మరోసారి ప్రతిష్ఠాత్మకంగా ఓ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సిద్దమవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చాలా ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ సినిమాలో పాత్రలను మణిరత్నం చాలా సంచలనాత్మకంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. తాజాగా బయటకు వచ్చిన నవాబ్ విషయాలు ఇవే..

మణిరత్నం నవాబ్‌లో
చెలియా చిత్రం ఫ్లాప్ తర్వాత మణిరత్నం తెరకెక్కించనున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, శింబు, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరీ తదితరులు నటిస్తున్నారు.

కీలకపాత్రల్లో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్‌గా, అరవింద్ స్వామి రాజకీయ నేతగా నటిస్తున్నట్టు తెలిసింది. అలాగే యెన్నైఅరిందాల్‌లో విలన్‌గా కనిపించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించనున్నారు.

రొమాంటిక్, సోషల్ డ్రామా
రెండు జంటల మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్స్, సోషల్ డ్రామాగా మణిరత్నం సినిమాను తెరకెక్కించనున్నారట. ఈచిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఫహద్ ఫాజిల్ స్థానంలో శరత్
మణిరత్నం సినిమాలో తొలుత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రకు ఎంపిక చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఫహాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ పాత్ర కోసం అంగమలి డైరీస్ ఫేం శరత్ ఎంపిక చేసినట్టు సమాచారం.

తెలుగులో నవాబ్‌గా
చెక్క చివంత వానమ్ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకు నవాబ్ అనే పేరును ఖరారు చేయడం గమనార్హం. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











