విజయ్ సేతుపతి కేక.. ట్రాన్స్ జెండర్‌గా అదరగొట్టిన విలక్షణ నటుడు
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన సూపర్ డీలక్స్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. తొలిసారిగా ట్రాన్స్ జెండర్ (లింగ మార్పిడి) చేయించుకొన్న యువకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో సమంత అక్కినేని, రమ్యకృష్ణ, భగవతి పెరుమల్, దర్శకుడు మిస్కిన్, గాయత్రి తదితరులు నటించారు.
ట్రాన్స్ జెండర్ పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి పేరు శిల్ప, సమంత పేరు వెంబు అని తెలిసింది. ఈ సినిమా కోసం నలన్ కుమార్‌స్వామి, మిస్కిన్, నీలన్ లాంటి ప్రముఖులు స్క్రీన్ ప్లేను అందించారు. సూపర్ డీలక్స్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. నీరవ్ షా, పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

అరణ్యకాండం చిత్రం తర్వాత దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమాను రూపొందించడంతో సూపర్ డీలక్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన తొలి చిత్రంతోనే భారీ కలెక్షన్లు సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు.
పొడిచేసే సూపర్ డైరెక్టర్ త్యాగరాజన్ నుంచి వస్తున్న గొప్ప చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇదేనంటూ విజయ్ సేతుపతి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











