Vijay Sethupathi మీద దాడి.. బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ఎటాక్.. దాడికి కారణం అదేనా.. అసలు ఏమైంది?
ఒక్కోసారి సెలబ్రిటీలను కలిసినప్పుడు కామన్ మాన్ ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయం ఎవరూ ఊహించలేరు.. సాధారణంగా సెలబ్రిటీలు కనిపిస్తే ఫోటోలు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది. కానీ తాజాగా జరిగిన ఒక ఘటనలో ఒక ఆగంతకుడు విజయ్ సేతుపతి మీద దాడి చేయడం సంచలనంగా మారింది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ సేతుపతి మీ దాడి ఎందుకు జరిగింది? అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళితే

కంపెనీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి
తమిళ సినిమాల్లో కంపెనీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ స్థాయికి చేరుకున్నారు విజయ్ సేతుపతి. నటుడు కావడానికి అష్టకష్టాలు పడి చివరికి హీరో స్థాయికి ఎదిగాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించాడు విజయ్ సేతుపతి. కంపెనీ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన నటనతో ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటిస్తూ విలన్ గా అవకాశాలు వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఆలస్యంగా వెలుగులోకి
ప్రస్తుతం తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో భాషా భేదం లేకుండా దాదాపు ఏ సినిమా అవకాశం వచ్చినా వదలకుండా ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఆయన మీద బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఒక షూటింగ్ ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఆయన మీద దాడి జరిగినట్లు చెబుతున్నారు.. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినా అది ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.

వెనక నుంచి ఎగిరి తన్నడం
విజయ్ సేతుపతి తన బృందంతో కలిసి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఓ ఆగంతకుడు పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుంచి ఎగిరి తన్నడం వీడియోలో కనిపిస్తుంది. అయితే విజయ్ సేతుపతి పక్కన ఉన్న పర్సనల్ అసిస్టెంట్ మీద ఆ వ్యక్తి పడడంతో పర్సనల్ అసిస్టెంట్ వెళ్లి విజయ మీద పడినట్లు చెబుతున్నారు. దీంతో దాడి విజయ్ సేతుపతి టార్గెట్ గా చేసుకుని చేశాడా? లేక విజయ్ సేతుపతి పర్సనల్ అసిస్టెంట్ మీద దాడి చేశాడా? అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

అందుకే దాడి జరిగిందా?
విజయ్ సేతుపతి మీద దాడి జరిగిన వెంటనే చుట్టూ ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యి విజయ్ సేతుపతిని క్షేమంగా పక్కకి తీసుకువెళ్లగా దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.. అయితే దాడి ఎందుకు జరిగింది? అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేకపోయినా రకరకాల ప్రచారాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ మృతి చెందితే తెలుగు హీరోలు దాదాపు చాలా మంది వచ్చి సంతాపం ప్రకటించారు కానీ పక్కనే ఉన్న తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా రాకపోవడంతో కన్నడ అభిమానులను బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఖండించి తీరాల్సిందే
బహుశా ఈ కోణంలోనే పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఎవరైనా దాడి చేసి ఉంటారనే ప్రచారం జరుగుతున్నా దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఏమీ లేవు. అయితే పోలీసులు చెబితే గానీ ఎవరు దాడి చేశారు అనే దాని మీద ఒక సరైన అవగాహన వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా ఇలా దాడి చేయడం అనేది మాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. సెలబ్రిటీలనే కాదు సామాన్య మానవుల మీద కూడా ఇలా దాడి చేయడాన్ని ఎవరైనా ఖండించి తీరాల్సిందే.


Click it and Unblock the Notifications











