భగవద్గీతని అవమానించేలా ట్వీట్.. అసలు నిజం బయట పెట్టిన స్టార్ హీరో!

ప్రస్తుతం సోషల్ మీడియా సెలెబ్రెటీలకు పెద్ద సమస్యలా మారిపోయింది. చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలెబ్రిటీలు చిన్న పొరపాటు చేసినా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అదే సమయం,ఫేక్ న్యూస్ బెడద కూడా సెలెబ్రెటీలకు ఎక్కువవుతోంది. మార్పింగ్ ఫోటోలు, అసత్య ప్రచారాలు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రభావం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై కూడా పడింది. విజయ్ సేతుపతి చేసిన ట్వీట్ అంటూ ఓ అసత్య వార్త ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన విజయ సేతుపతి అసలు విషయాన్ని బయట పెట్టాడు.

 భగవత్ గీతని అవమానించేలా

భగవత్ గీతని అవమానించేలా

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ చూసిన నెటిజన్లు విజయ్ సేతుపతిని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందటే.. భగవత్ గీత ఆధ్యాత్మిక పుస్తకం కాదు.. అందులో ఉన్న కల్పిత అంశాలే ప్రస్తుత సమాజం దిగజారడానికి కారణం అని విజయ్ సేతుపతి ట్వీట్ చేసినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి ఆ ట్వీట్ విజయ్ సేతుపతి చేయలేదు. విజయ్ సేతుపతి చేసిన మరో ట్వీట్ ని ఫోటో షాప్ చేసి ప్రచారం చేశారు.

మొబైల్స్ చోరీ గురించి

వాస్తవానికి విజయ్ సేతుపతి తమిళనాడు పోలీసులని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. మొబైల్ ఫోన్ చోరీలని తగ్గించేందుకు తమిళనాడు పోలీసులు సరికొత్త విధానం అనుసారిస్తున్నారు. దీనిని వివరిస్తూ విజయ్ సేతుపతి ట్వీట్ చేశాడు. విజయ్ సేతుపతి పోలీసులని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఓ మీడియా ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ గా వచ్చింది. ఈ బ్రేకింగ్ న్యూస్ ని ఫోటో షాప్ చేసిన కొందరు విజయ్ భగవత్ గీతని అవమానించినట్లుగా చిత్రీకరించారు.

 అలాంటి పనులు చేయను

అలాంటి పనులు చేయను

ఒరిజినల్ ఏదో, ఫేక్ ఏదో చేబోతూ విజయ్ మరో ట్వీట్ చేశాడు. నేను ఏ ఆధ్యాత్మిక పుస్తకాన్ని, పురాణాలని కించపరిచే విధంగా మాట్లాడను. భవిష్యత్తులో కూడా అలాంటి పనులు చేయను. ప్రజల మనోభావాలకు భంగం వాటిల్లకుండా తాను నడుచుకుంటానని విజయ్ సేతుపతి తెలిపాడు. విజయ్ సేతుపతి విలక్షణ నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.

 తిరుగులేని విజయం

తిరుగులేని విజయం

విజయ్ సేతుపతి, త్రిష గత ఏడాది కలసి నటించిన 96 చిత్రం తిరుగులేని విజయాన్ని సాధించింది. విజయ్ సేతుపతి వైవిధ్యం ఉన్న పాత్రలని ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్రంతో విజయ్ సేతుపతి టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. సైరా చిత్రంలో విజయ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X