Vijay Sethupathi: రజనీకాంత్ కోసం విజయ్ సేతుపతి రూల్ బ్రేక్!

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు విజయ్ సేతుపతి, దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పని చేసిన సాధారణ వ్యక్తి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. చిన్న పాత్రలతో మొదలుపెట్టి హీరోగా నిలదొక్కుకున్న ఆయన, హీరోగా పీక్‌లో ఉన్నప్పుడే విలన్ పాత్రలతోనూ మెప్పించారు. పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, ప్రస్తుతం వరుస సినిమాలతో తమిళ సినీరంగంలో బిజీగా కొనసాగుతున్నారు.

అయితే.. తన పాత్రల ఎంపికలో చాలా కఠినమైన నియమాలు పాటించే నటుడిగా పేరొందిన విజయ్ సేతుపతి తాజాగా తనే పెట్టుకున్న రూల్‌ను బ్రేక్ చేశాడు. సాధారణంగా కెమియో పాత్రలు చేయను అని ఎన్నోసార్లు చెప్పిన విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ జైలర్ 2 (Jailer 2)లో విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

Vijay Sethupathi Breaks His No-Cameo Rule for Rajinikanth in Jailer 2

ఇటీవల ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు. "నేను సాధారణంగా కెమియో రోల్స్ చేయను. చిన్న పాత్రలకంటే బలమైన క్యారెక్టర్లకే ప్రాధాన్యం ఇస్తాను. కానీ రజనీకాంత్ సార్‌తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం వస్తే మాత్రం 'నో' అనలేకపోయాను'అని ఆయన చెప్పారు. 'ఆయనతో కలిసి ఉండటం ఎంతో నేర్చుకునే అనుభవం. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నిలబడి ఉన్న సూపర్‌స్టార్ల ప్రయాణం నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు' అని విజయ్ వ్యాఖ్యానించాడు.

విజయ్ సేతుపతి-రజనీకాంత్ కాంబినేషన్ ఇది కొత్తది కాదు. గతంలో పేటా (Petta)లో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు మళ్లీ జైలర్ 2 లో వీరిద్దరూ కనిపించనుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. 2023లో విడుదలైన జైలర్ సూపర్ హిట్‌గా నిలిచి, ఆ సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇంటర్వ్యూలో విజయ్ మరో ఆసక్తికర అంశాన్ని కూడా ప్రస్తావించాడు. ఇటీవలి కాలంలో విలన్ పాత్రల ఎంపిక విషయంలో తాను మరింత జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపాడు. 'నాకు నెగటివ్ పాత్రలు చేయడం ఇష్టం. కానీ ఇప్పుడు చాలా రొటీన్ విలన్ రోల్స్ ఆఫర్ అవుతున్నాయి. అలాంటి పాత్రలు రిపీట్ చేయాలనిపించడం లేదు' అని స్పష్టం చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో విజయ్ సేతుపతి కెరీర్ ఇప్పుడు వేగంగా దూసుకుపోతోంది.

జవాన్, మేరీ క్రిస్టమస్, అలాగే పార్జీ (Farzi)వంటి ప్రాజెక్టులు ఆయన మార్కెట్‌ను మరింత పెంచాయి. ఇక త్వరలో గాంధీ టాక్స్ (Gandhi Talks)లోనూ విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొత్తానికి కెమియోలు చేయను అనే తన రూల్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం పక్కన పెట్టడం ద్వారా, విజయ్ సేతుపతి సూపర్ స్టార్‌పై ఉన్న గౌరవాన్ని మరోసారి చాటిచెప్పాడు. జైలర్ 2లో ఈ ప్రత్యేక పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X