twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడి పేరుతో రెచ్చగొడుతూ దేశంలో అరాచకాలు.. సర్కార్‌పై విజయ్ సేతుపతి నిప్పులు

    |

    దళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రం ఆడియో ఫంక్షన్ చెన్నైలో కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలో విజయ్ జోష్‌తో కూడిన స్పీచ్‌ను పక్కన పడితే.. విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన ఎమోషనల్ స్పీచ్ మరింత ఆకట్టుకొన్నది. ప్రభుత్వాలపై పరోక్షంగా కామెంట్లు చేస్తూ చేసిన ప్రసంగం ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ సేతుపతి ఏమన్నారంటే..

    కరోనావైరస్ చూసి భయపడొద్దు

    కరోనావైరస్ చూసి భయపడొద్దు

    ప్రస్తుతం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ గురించి విజయ్ సేతుపతి జాగ్రత్తలు సూచించారు. ఇలాంటి భయాందోళనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రకృతిలో ఇలాంటి వైరస్ రావడం వాటిని విస్మరించకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి. ఒత్తిడికి గురికావొద్దని చెబుతాను అని విజయ్ సేతుపతి సూచించారు.

    మానసికంగా ధృడంగా ఉండాలి

    మానసికంగా ధృడంగా ఉండాలి

    కరోనా గానీ, ఇతర ఏ ప్రాణాంతక వ్యాధైనా సరే... భయాందోళనలకు గురికావొద్దు. మానసికంగా ధృడంగా మారి ఇలాంటి మహమ్మారిపై పోరాటం చేయాలి. నేను నా కుటుంబ సభ్యులకు ఇదే విషయాన్ని చెబుతాను. వారిని మానసికంగా ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకొంటాను. నా ఫ్యాన్స్ కూడా అలానే ఉండాలని అనుకొంటాను అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

    దేవుడి పేరుతో అరాచకం.. కరోనా కంటే డేంజరస్

    దేవుడి పేరుతో అరాచకం.. కరోనా కంటే డేంజరస్

    ప్రస్తుతం సమాజంలో దేవుడి పేరుతో రెచ్చగొడుతూ పెద్ద యుద్ధమే జరుగుతున్నది. అది కరోనా కంటే చాలా డేంజరస్‌గా సమాజానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొని ఉంది. నా దేవుడే గొప్ప అనే మూర్ఖంగా వాదించే వారితో వాదించకండి. అలాంటి వారికి దేవుడి కంటే మానవత్వం, సోదరభావం గొప్పదని బోధించండి అని విజయ్ సేతుపతి తన ప్రసంగంలో ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

    మానవత్వం, సోదరభావంతో..

    మానవత్వం, సోదరభావంతో..

    మానవత్వంతో మెదిలే వారు, తోటి పౌరులను సోదరభావంతో చూసేవారు దేవుడిని దూరంగా పెడుతారు. కాబట్టి దేవుడి కంటే మానవత్వమే గొప్పదని నేను భావిస్తాను. నా తండ్రి కూడా నాకు అదే నేర్పించారు. నా తండ్రి ఈ లోకంలో లేకున్నా దానిని నేను ఎప్పుడు ఆచరిస్తాను అని విజయ్ సేతుపతి ఎమోషనల్ అయ్యారు.

    Recommended Video

    Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
    నా తండ్రియే నా హీరో

    నా తండ్రియే నా హీరో

    తన తండ్రి గురించి మాట్లాడుతూ విజయ్ సేతుపతి భావోద్వేగానికి గురయ్యారు. నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకొన్నాను. ఈ దశలో నా హోదాను చూడటానికి నా తండ్రి లేడనే బాధ నన్ను వెంటాడుతుంటుంది. నా జీవితంలో నాకు నిజమైన హీరో నా తండ్రే. గొప్ప ప్రతిభను చూపించే ప్రతీ ఒక్కరు మాస్టరే అని విజయ్ సేతుపతి ప్రసంగాన్ని ముగించారు.

    English summary
    Vijay Sethupathi contraversial speech at Master audio goes viral in the media. Vijay Sethupati satires on Governments and said that it as a more dangerous one than coronavirus which is fighting in the name of God.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X