అందుకోసం కూడా వ్యాక్సిన్ కనిపెట్టాలి.. స్టార్ యాక్టర్ ఎమోషనల్ కామెంట్!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అగ్ర దేశాలు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇండియాని కూడా వణికిస్తున్న ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు వైద్య శాస్త్ర వేత్తలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ వ్యాక్సిన్ తొంరగగా కనిపెట్టలని ప్రపంచమంతా ప్రార్థిస్తోంది.

ఈ తరుణంలో ఒక టాలెంటెడ్ హీరో మాత్రం దానికంటే ముందు మరొక దానికి వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం ఉందని చాలా ఎమోషనల్ గా స్పందించారు. అతనెవరో కాదు.. తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా సపోర్టింగ్, నెగిటివ్ క్యారెక్టర్స్ తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సామాజిక అంశాలపై స్పందించడంలో ముందుంటాడు. ఇక ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను గురించి తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

Vijay sethupathi emotional tweet on poor people

'ఈ భూమి మీదా ఆకలి అనే బాధ కోసం కూడా ఒక వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆకలి అనే వ్యాధి ఎప్పటి నుంచో బాధ పెడుతోంది' అని విజయ్ సేతుపతి ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి సమయంలోనే నాయకుల అసలు పాలన బయటపడుతుందని, ఆకలి బాధల నుంచి పేదలను తప్పించాల్సిన బాధ్యత అందరికి ఉందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X