అందుకే కొత్త డైరక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నా

By Srikanya

Vijay Sethupathi
చెన్నై : కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వటానికి కారణం వారిలో గెలవాలన్న కసి, అపారమైనే ప్రతిభ దాగి ఉండటమేనని కోలీవుడ్‌ సంచలన నటుడు విజయ్‌ సేతుపతి స్పష్టం చేసి చెప్పారు. అలాగే కథకు తొలి ప్రాధాన్యం ఇవ్వటమే తన విజయ రహస్యమని అన్నారు.

విజయ్‌ సేతుపతి రీసెంట్ గా ... 'పిజ్జా', 'నడువల కొంజెం పక్కత్తు కానోం', 'సూదుకవ్వుం'తోవరుస విజయాలను అందుకుని మినిమం గ్యారెంటీ హీరోగా ముద్ర సాధించాడు. ఇప్పుడు ఆయన పూర్తి బిజీ హీరో అయ్యిపోయారు. దానికి కారణం మీడియావారు ఆయన్ని ప్రశ్నించారు.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ... నేను పెద్ద స్టార్‌ను కాను. నాకంటూ ఇమేజ్‌ లేదు. ప్రత్యేకంగా కొన్ని పాత్రల్లోనే నటించాలన్న నియమాలేవీ లేవు. అదే సమయంలో ప్రేక్షకులను ఎంచుకున్న కథ ఎంతమేరకు రంజింపజేస్తుందనే విషయాలకే ప్రాముఖ్యత ఇస్తాను. ఇప్పటి వరకు నటించిన, నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఇదే సూత్రాన్నే పాటిస్తున్నాను. గ్రామీణ కథలే కాక అన్ని తరహా చిత్రాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నాను అన్నారు.

ఇక విజయసేతుపతి ..పిజ్జా చిత్రం తెలుగునాట కూడా బాగా ఆడి,మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అలాగే నడువల కొంజెం పక్కత్తు కానోం' చిత్రాన్ని అల్లరి నరేష్ తో తెలుగులో రీమేక్ కు ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రక్కన 'సూదుకవ్వుం' తెలుగు రీమేక్ రైట్స్ ని కూడా ఓ పెద్ద నిర్మాత తీసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X