ఐటీ రైడ్స్, మత మార్పిడిపై వార్తలు.. మీకు పనేం లేదా.. విజయ్ సేతుపతి ఫైర్
తమిళనాట సంచలనంగా మారిన ఐటీ రైడ్స్ రోజుకో మలుపు తిరిగింది. చివరకు రాజకీయ రంగు పూసుకోవడంతో ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షపార్టీలు బీజేపీపై, అధికార పక్షంపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఈ వివాదానికి సంబంధించి లెక్కలేనన్ని విశ్లేషణలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ విశ్లేషణపై మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

ఐటీ రైడ్స్ వెనకున్న కారణం..
విజయ్‌పై ఐటీ రైడ్స్ వ్యవహారంపై ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. విజయ్‌పై ఐటీ రైడ్స్ వ్యవహారం వెనుక క్రిస్టియానిటీ సంస్థలు ఇచ్చిన ఫండింగ్ ఉందని ఆ కథనం సారాంశం. ఇలా కొంతమంది హీరోలకు క్రిస్టియన్ సంస్థల నుంచి డబ్బులు వస్తుంటాయని, వాటితోనే సినిమాలను నిర్మిస్తుంటారని ఇలా ఏదేదో చెప్పుకొచ్చారు.

క్రిస్టియానిటీ ప్రచారం..
జెప్పియర్ కూతురైన రెజీనా.. తమిళనాడులో క్రిస్టియానిటీని వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగా వడపలనిలో రీసెంట్ చేసిన ఈవెంట్‌లో విజయ్ సేతుపతి, ఆర్య, రమేష్ ఖన్నా, ఆర్తీ మరికొంత మంది సినీ ప్రముఖులు క్రిస్టియన్స్‌గా మారారని ఆ కథనంలో ఉంది.
మిగతావారిని కూడా..
వీరంతా మిగతా సెలెబ్రిటీలను కూడా తమ మతంలోకి మార్చాలనే కండీషన్ మీద వచ్చారని పేర్కొంది. వీరందంరికి క్రిస్టియన్ విద్యాసంస్థల నుంచి డబ్బు చేతులు మారుతుందని ఆ కథనంలో ఉంది. బిగిల్ చిత్రానికి ఈ సంస్థల నుంచే ఫండింగ్ వచ్చిందని అందుకనే రైడ్స్ జరిగాయని అందులో ఉంది.
Recommended Video

ఒక్కే ఒక్క మాటతో..
ఇలా పిచ్చి పిచ్చిగా ప్రచురితమయ్యే కథనాలపై మామూలుగా సెలెబ్రిటీలెవ్వరూ కూడా స్పందించారు. అలాంటిది ఎప్పుడూ ప్రశాంతంగా, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే విజయ్ సేతుపతి ఫైర్ అయ్యాడు. మూసుకుని ఏదైనా పని చూసుకో అనే అర్థం వచ్చేట్టుగా.. మీకేం పనిలేదా? అంటూ ట్వీట్ చేశాడు. ఒకే ఒక్క మాటతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











