ఊపిరాడనంత బిజీగా విజయ్ సేతుపతి.. మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి కంటే ఎక్కువగా బిజీగా ఉన్న నటులలో విజయ్ సేతుపతి టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో క్రేజ్ అందుకుంటున్నాడు. విజయ్ సేతుపతి రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. అతని డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈ నటుడు కూడా కేవలం తనకు నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. ఇక ఇక రీసెంట్ గా మరొక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విజయ్ సేతుపతి కోసమని కొంతమంది దర్శకులు అతని పాత్రలో బలాన్ని పెంచుతుంటారు కూడా. ఇక మాస్టర్ సినిమాలో స్టార్ హీరో విజయ్ కు ప్రతి నాయకుడిగా కనిపించి సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. సేతుపతి వల్లనే ఆ సినిమాకు తెలుగులో కూడా భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక చాలా రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతనికి గ్యాప్ లేకుండా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇదివరకే సైరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

vijay sethupathi green signal to another tollywood movie

ఉప్పెనలో విలన్ రోల్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ పాత్ర వల్ల హీరో వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడని కూడా చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా సందీప్ కిషన్ కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే సమర్పణలో భరత్ చౌదరి అనే ఒక కొత్త దర్శకుడు సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక అందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే చేతిలో పది సినిమాలున్నా టాలీవుడ్ ఆఫర్ అనగానే విజయ్ కథను వినడానికి ఒప్పుకున్నాడట. ఇంతకుముందు అయితే కథలు విన్న తరువాత నచ్చినా నచ్చకపోయినా కూడా రిజెక్ట్ చేసేవాడట. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డాడట. కానీ ఉప్పెన తరువాత మాత్రం అతని ఆలోచన మారింది. అందుకే మరొక కొత్త కథ నచ్చగానే ఓకే చెప్పినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X