twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ సేతుపతి గొప్పతనం.. కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన డైరెక్టర్ మృతి.. ఏం చేశాడంటే?

    |

    ఎంత పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకున్నా కూడా జీవితంలో ఎవరో ఒకరు సపోర్ట్ గా ఉండాల్సిందే. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎవరో ఒకరు ఎదుగుదలలో తప్పకుండా హెల్ప్ అవుతుంటారు. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండేవారే నిజమైన హీరోలని చెప్పాలి. విజయ్ సేతుపతి కూడా అలాంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. కష్ట సమయాల్లో అన్నం పెట్టి, నటుడిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడి అంతిమయాత్రలో పాల్గొన్నారు. పాడే మోసే ఆ నలుగురిలో ఒకడై నడిచాడు.

    మంచి మనిషిగా

    మంచి మనిషిగా

    సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. చిన్నగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన సేతుపతి కేవలం నటనతోనే కాకుండా తన మంచి తనంతో కూడా అభిమానులను పెంచుకున్నాడు. కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సహాయలు చేస్తూ మంచి మనిషిగా కూడా సాధారణ మనుషులకు దగ్గరవుతున్నాడు.

    బికినీ బేబీగా అప్సర రాణి.. స్విమ్మింగ్ పూల్‌లో అలాంటి అవతారంతో

    ఆర్థికంగానే కాకుండా

    ఆర్థికంగానే కాకుండా

    అయితే నటుడిగా ఒక స్థాయికి చేరుకున్న తరువాత కూడా విజయ్ సేతుపతి తనకు మంచి చేసిన వారిని ఏ మాత్రం మరువలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎదో ఒక విధంగా ఇప్పుడు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆర్థికంగానే కాకుండా సినిమా అవకాశాలు కూడా ఇప్పిస్తున్నాడు.

    దర్శకుడు మరణించడంతో..

    దర్శకుడు మరణించడంతో..

    ఇక రీసెంట్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ దర్శకుడు మరణించడంతో సేతుపతి అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ఎస్. పి. జననాథన్ 14 తేదీ మధ్యాహ్నం బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ మరణించారు. సాంఘిక స్పృహ ఉన్న చిత్రనిర్మాత ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది.

    సేతుపతి ఆకలిని తీర్చిన వ్యక్తి

    సేతుపతి ఆకలిని తీర్చిన వ్యక్తి

    కష్టాల్లో ఉన్నప్పుడు విజయ్ సేతుపతికి ఆ దర్శకుడు ఎంతగానో సహాయం చేశాడు. సినిమా ఛాన్సులు ఇప్పించడమే కాకుండా చాలా సందర్భాల్లో సేతుపతి ఆకలిని తీర్చిన వ్యక్తి. జననాథన్ చేసిన మేలును మరువని సేతుపతి అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి హాస్పిటల్ ఖర్చులు మొత్తం భరించాడు. రోజు అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకునే వారు.

     అంతిమయాత్రలో

    అంతిమయాత్రలో

    ఇక సడన్ గా జననాథన్ మృతి చెందడంతో హాస్పిటల్ కు వెళ్లిన విజయ్ సేతుపతి.. పార్థివదేహం ఇంటికి వచ్చేవరకు ఉన్నాడు. అంతే కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమక్రియలు పూర్తయ్యేవరకు కూడా అక్కడే ఉన్నాడు. జననాథన్ మరణంతో విజయ్ సేతుపతి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

    దర్శకుడికి అండగా..

    దర్శకుడికి అండగా..

    జననాథన్ దర్శకుడిగా మొదట్లో కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ మధ్య అపజయాలు ఎదుర్కొన్నారు. అవకాశాలు తగ్గడంతో విజయ్ సేతుపతి సొంతంగా ఆయనతో సినిమాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. లాభం అనే సినిమాను కూడా స్టార్ట్ చేశారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. సినిమాలు చేయడం ఆపకండి నేను ఎప్పుడైనా సరే ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని విజయ్ సేతుపతి ఆ దర్శకుడికి మాటా కూడా ఇచ్చాడు. ఏదేమైనా విజయ్ చూపించిన ఈ ప్రేమకు అభిమానులు మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు.

    English summary
    Vijay Sethupathi also proved to be such a person. Putting help in difficult times and attending a funeral for a director who gave him the opportunity to grow as an actor. Vijay sethupathi heart touching gestures in director funerals,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X