నయన్ ప్రియుడికి విజయ్ ముద్దు.. మగవారికే ఎందుకు పెడుతుంటావ్.. హీరోకు నెటిజన్స్ ప్రశ్న
మక్కల్ సెల్వన్ అంటూ విజయ్ సేతుపతిని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. తమిళనాట అనతి కాలంతో అంతులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు విజయ్. ఏ క్యారెక్టర్ చేసినా అందులో తన స్టైల్‌ను జోడించడం, సహజత్వానికి దగ్గరగా ఉండేలా నటిస్తాడు. హీరో, విలన్, కీ రోల్ ఇలా ఏదైనా సరే విజయ్ ఆ పాత్రకు ప్రాణం పోసేస్తాడు. తమిళ నాట నెగెటివిటీ లేని ఏకైక హీరో విజయ్ సేతుపతి ఒక్కడే. అయితే గతకొన్ని రోజులుగా విజయ్ సేతుపతి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

దళపతిపై ఐటీ రైడ్స్..
దళపతి విజయ్‌పై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాజకీయంగా కూడా మలుపు తిరిగింది. అంతేకాకుండా ఈ విషయానికి మతం రంగు పులిమేందుకు కూడా కొంత మంది ప్రయత్నించారు. క్రిస్టియన్ మిషనరీలు ఈ హీరోల వెనుకున్నాయని, విజయ్, విజయ్ సేతుపతి వంటి వారు మత ప్రచారకులుగా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందిస్తూ... ఏదైనా పనికొచ్చే పనిచేసుకోండని విజయ్ సేతుపతి ఫైర్ అయ్యాడు.
విజయ్‌కు విజయ్ ముద్దు..
దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో మాస్టర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడు. ఈ మేరకు రిలీజైన పోస్టర్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా దళపతికి విజయ్ ప్రేమతో ఓ ముద్దు పెట్టాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆపై ఆడియో వేడుకలో తిరిగి విజయ్ సేతుపతికి దళపతి ముద్దు పెట్టాడనుకోండి.

తాజాగా నయన్ ప్రియుడికి..
నయన తార ప్రియుడు విఘ్నేశ్ శివన్‌కు విజయ్ సేతుపతి ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన పిక్‌ను విఘ్నేశ్ షేర్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో కాతువ కులరేందు కాదల్ అనే చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సందర్భంగా వీరిద్దరు రీసెంట్‌గా కలిశారు. ఆ సందర్బంలో విఘ్నేశ్‌కు విజయ్ ముద్దు పెట్టాడు.
Recommended Video

మగవారికే ఎందుకు...
అయితే ఈ పిక్‌ను చూసిన ఓ నెటిజన్.. ఎల్లప్పుడూ మగవారికే ఎందుకు ముద్దు పెడతారంటూ ప్రశ్నించాడు. ఆయనపై ఉన్న ప్రేమను అలా చూపించాడు.. దాంట్లో తప్పేముందని ఫ్యాన్స్ సదరు నెటిజన్‌కు సమాధానమిస్తున్నారు. దళపతి విజయ్‌ను సైతం విఘ్నేశ్ శివన్ కలిశాడు. దానికి సంబంధించిన ఫోటో కూడా తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











