విజయ్ సేతుపతి ‘జుంగా’ అఫీషియల్ ట్రైలర్
రోటీన్ కథలు కాకుండా కాకుండా విభిన్నమైన స్టోరీస్ ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ సేతిపతి. త్వరలో విజయ్ సేతుపతి 'జుంగా' అనే యాక్షన్ కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
విజయ్ సేతుపతి ఇందులో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అతడి గెటప్, గ్యాంగస్టర్‌గా అతడు ఇచ్చే బిల్డప్పులు ప్రేక్షకులను తెగ నవ్విస్తాయని స్పష్టమవుతోంది. సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. డాన్ అసిస్టెంట్ పాత్రలో కమెడియన్ యోగిబాబు నటిస్తున్నారు.

విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ బేనర్లో ఆయననే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరిపారు.
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌కు సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందిస్తుండగా, డూడ్లే సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. విజె సాబు జోసెఫ్ ఎడిటర్.


Click it and Unblock the Notifications











