తండ్రీ కొడుకులు కొట్టుకున్నారు: హీరో విజయ్ సేతుపతి వీడియో వైరల్
విజయ్ సేతుపతి హీరోగా 'సింధుబాద్' అనే తమిళ చిత్రం రూపొందుతోంది. పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి చిత్రాల తర్వాత దర్శకుడు ఎస్‌యూ అరుణ్ కుమార్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంజలి, లింగా, రాజరాజన్, షాన్ సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'సింధుబాద్' మూవీ ఇంకా చాలా రకాలుగా విజయ్ సేతుపతికి ప్రత్యేకం. ఎందుకంటే ఈ చిత్రంలో అతడి కుమారుడు సూర్య ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ కోసం సినిమా సెట్స్‌లో తండ్రీ కొడుకులు ఫైట్ సీన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పిల్లాడిని పట్టుకుని అలా కొడుతున్నాడేంటి
మొదట ఆ వీడియో చూసిన అందరూ... పిల్లాడిని పట్టుకుని అలా కొడుతున్నాడేంటి అని షాకయ్యారు. అయితే చివర్లో ముద్దు పెట్టడంతో తండ్రీ కొడుకులు ఫైట్ సీన్ రిహార్సల్ చేస్తున్న విషయం అర్థమైంది.

టీజర్‌కు అద్భుతమైన స్పందన
ఇటీవల ‘సింధుబాద్' చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. తక్కువ సమయంలోనే 3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఒక అద్భుతమైన స్టోరీతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

సింధుబాద్
‘సింధుబాద్' చిత్రాన్ని వాసన్ మూవీస్, కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

విజయ్ సేతుపతి కుమారుడు సూర్య
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య ఇంతకు ముందు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘నానుమ్ రౌడీ ధాన్', గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ‘జుంగా' చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











