వెండితెరపైకి మరో క్రికెటర్ బయోపిక్.. తమిళ్ హీరో ఫిక్స్
గత కొంత కాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రియల్ లైఫ్ కి సంబంధించిన కథలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో ప్రేరరాణగా నిలిచే క్రీడాకారుల ఎమోషనల్ కథలు కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. ఇక మొదటిసారి శ్రీలంకకు చెందిన క్రికెటర్ బయోపిక్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. ఆ బయోపిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు.
ఇక ఆ క్రికెటర్ మరెవరో కాదు. ఒకప్పుడు ప్రపంచంలో అతి భయంకరమైన స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముత్తయ్య మురళీధరన్. ఈ లెజండరీ క్రికెటర్ జీవితంను సినిమాగా రూపొందించడానికి తమిళ్ టెక్నీషియన్స్ సిద్ధమవుతున్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. విజయ్ సేతుపతి కూడా ఫిక్స్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి.. ఇక ఆ రూమర్స్ ఇప్పుడు నిజమయ్యాయి. ఫైనల్ గా హీరో దొరికాడని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేశారు.

హీరోగానే కాకుండా ఎన్నో ప్రయోగాత్మకమైన పాత్రలతో క్రేజ్ అందుకున్న విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ దిగ్గజ బౌలర్ శైలిని అలవాటు చేసుకోవాలి అంటే అంత సాదారణమైన విషయం కాదు. ఇక విజయ్ సేతుపతి టాలెంట్ ని కూడా తక్కువంఛనా వేయలేము. ఇక మొత్తానికైతే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఎమ్ఎస్.శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్, డర్ మోషన్ పిక్చర్ సంయుక్తంగా నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











