Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విజయ్ సేతుపతి హల్చల్.. ట్రెండింగ్‌లో ‘తుగ్లక్ దర్భార్’
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి దక్షిణాదిలో పరిచయమే అక్కర్లేదు. కింది స్థాయి నుంచి మొదలు పెట్టి.. సౌత్ మొత్తం గర్వపడేలా స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. కొందరి విషయంలోనే సంపూర్ణ నటుడని మనం చెప్పగలం. అందులో ఈ తరంలోని నటుల్లో విజయ్ సేతుపతి పేరు ముందుంటుంది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేయగలడు. అందుకే తమిళ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసినా మొత్తం దక్షిణాదినా పట్టు సాధించాడు.
విజయ్ సేతుపతి గురించి చెప్పాలంటే ఓ విక్రమ్ వేద, ఓ సూపర్ డీలక్స్.. ఓ 96 ఇలా ఎన్నో చిత్రాలు ఆయన కెరీర్లో ఉన్నాయి. ఆ మధ్య సైరా చిత్రంలో ఓ చిన్న పాత్రలో విజయ్ మెరిశాడు. చేసింది చిన్న క్యారెక్టరే అయినా.. తనదైన మార్క్‌ను చూపెట్టాడు. ఇక అంతా బాగుండి ఉంటే.. ఈ పాటికే తనలోని విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించేవాడే. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ పాత్రకు సంబంధించిన లుక్ ఎంతగానో వైరల్ అయింది.
తాజాగా విజయ్ కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తుగ్లక్ దర్భార్ పేరిట చేస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ట్విట్టర్లో నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవింద్ వసంత్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాధా కృష్ణన్ పార్థిబన్, అదితి రావ్ హైదరీ, మంజిమా మోహన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.