ఓటీటీలో విడుదల కానున్న మరో భారీ చిత్రం: విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్భార్’పై క్లారిటీ
పేరుకు తమిళ హీరోనే అయినా.. అద్భుతమైన నైపుణ్యంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. విలక్షణ నటనతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ తన హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన తాజా చిత్రం 'తుగ్లక్ దర్భార్'. అప్పుడెప్పుడో మొదలైన ఈ మూవీ.. గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన చిత్రమే 'తుగ్లక్ దర్భార్'. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం విడుదలపై తాజాగా ఓ న్యూస్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ భారీ చిత్రంలో థియేటర్లలో కాకుండా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కాబోతుందట. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చిత్ర యూనిట్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరో భారీ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందన్న టాక్ దక్షిణాది మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది.

చాలా రోజుల క్రితం విడుదలైన 'తుగ్లక్ దర్భార్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇందులో విజయ్ సేతుపతి రెండు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. రాధా కృష్ణన్ పార్థిబన్, అదితి రావ్ హైదరీ, మంజిమా మోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











