Thalapathy 68: సినిమా మేకింగ్ బడ్జెట్ కంటే విజయ్ రెమ్యునరేషనే ఎక్కువ.. నిర్మాత టోటల్ ఖర్చు ఎంతంటే?
ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని లోకేష్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే లోకేష్ యూనివర్ష్ కాన్సెప్ట్స్ లో భాగంగానే లియో మూవీ ఉండబోతోంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ మరల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తాడనే ప్రచారం నడిచింది.
అలాగే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మూవీ ఉంటుందని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా మరల కోలీవుడ్ డైరెక్టర్ కి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్ గా కస్టడీ మూవీతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేశారు. దళపతి 68గా ఈ మూవీ ఉండబోతోంది అని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

లోకేష్ కనగరాజ్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో 150 కోట్ల రూపాయిలు విజయ్ కు రెమ్యునరేషన్ గా ఇవ్వనున్నారట. రూ.110 కోట్ల మిగిలిన క్యాస్టింగ్ తో పాటు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఖర్చు చేయనున్నారని కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. అంటే ఈ ప్రాజెక్టుపై నిర్మాత దాదాపు 260 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది.
150 కోట్లు రెమ్యునరేషన్ అంటే ఇండియాలోనే హైయెస్ట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రభాస్ 100 నుంచి 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ క్రింద చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు దళపతి 68 కోసం విజయ్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం సెన్సేషన్ అయ్యింది. హీరో రెమ్యునరేషన్ కంటే సినిమా బడ్జెట్ తక్కువ కావడం విశేషం. మరి కస్టడీ లాంటి డిజాస్టర్ తర్వాత వెంకట్ ప్రభు కెపాసిటీ నమ్మి విజయ్ అతనికి పెద్ద అవకాశం ఇచ్చాడు. దీనిని ఏ స్థాయిలో అతను వినియోగించుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే కస్టడీ మూవీ విషయంలో కంటెంట్ పరంగా వెంకట్ ప్రభు ఫెయిల్యూర్ ఎక్కడా కనిపించలేదని. అయితే స్క్రీన్ ప్లే లో చిన్న చిన్న పొరపాట్లు కారణంగా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదని చెప్పాలి. మరి దళపతి విజయ్ తో వెంకట్ ప్రభు ఎలాంటి కథని సిల్వర్ స్క్రీన్ పై చూపించాబోతున్నారు అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











