LEO: చరిత్ర సృష్టించిన విజయ్.. ఇండియాలోనే టాప్ మూవీగా లియో.. జవాన్, పఠాన్ రికార్డులు బ్రేక్
పేరుకు కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఇళయదళపతి విజయ్. సుదీర్ఘ కాలంగా మాస్ మూవీలను చేస్తూ వస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో తన రేంజ్ పెంచుకునే సినిమాలతోనే వస్తున్నాడు. ఇలా ప్రతి చిత్రానికీ మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ 'లియో' అనే సినిమాలో నటించాడు. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు మీకోసమే!
తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన యూనివర్శ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఇళయదళపతి విజయ్ చేసిన యాక్షన్ సినిమానే 'లియో'. హిట్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే హైప్ ఏర్పడగా.. దానికి ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ మూవీని తెరకెక్కించారు.

ఇళయదళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్‌కూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో క్రమంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక బిజినెస్‌ను కూడా జరుపుకుంది. తద్వారా విజయ్ కెరీర్‌లోనే గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న సినిమాగానూ నిలిచింది.
పూర్తి స్థాయి యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'లియో' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే యూఎస్, యూకే సహా చాలా ప్రాంతాల్లో ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్లుగానే బుకింగ్స్ కూడా ఎప్పుడో ప్రారంభించింది.

మరీ ముఖ్యంగా యూకే (యునైటెడ్ కింగ్‌డమ్)కు సంబంధించి 'లియో' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ను చాలా రోజుల క్రితమే ఓపెన్ చేశారు. అక్కడ ఇళయదళపతి విజయ్ సినిమాకు ఊహించని రీతిలో హైప్ ఏర్పడడంతో టికెట్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఫలితంగా అక్కడ మొదటి రోజు షోలకు బుకింగ్స్ భారీగా వచ్చాయి. దీంతో అప్పుడే 345K పౌండ్లు రాబట్టింది.
మొదటి రోజు షోలకు గానూ 'లియో' మూవీకి యూకేలో అప్పుడే 345K పౌండ్ల వసూళ్లు రావడంతో సరికొత్త చరిత్ర నమోదు అయింది. దీనికి కారణం మరే ఇండియన్ మూవీ కూడా ఇంత మొత్తం వసూలు చేయలేదు. గతంలో 'పఠాన్' మూవీ అక్కడ మొదటి రోజు 319K పౌండ్లు, జవాన్ 307K పౌండ్లు రాబట్టాయి. ఇప్పుడు వాటి రికార్డులను విజయ్ మూవీ బ్రేక్ చేసేసింది.

ఇక, క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా నటించాడు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











