LEO Movie Leaked: విజయ్‌కు కోలుకోలేని షాక్.. రిలీజ్ రోజే లియో మూవీ లీక్.. సంచలనంగా మారిన ట్వీట్

కెరీర్ ఆరంభం నుంచీ క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను అలరించే సినిమాలు చేస్తూ.. తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటూ వెళ్తోన్న హీరోనే ఇళయదళపతి విజయ్. ఈ మధ్య కాలంలో మరింత రేంజ్‌కు ఎదిగిపోయిన అతడు.. భారీ చిత్రాలతోనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'లియో' అనే యాక్షన్ మూవీని చేశాడు. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, విడుదలైన గంటల్లోనే విజయ్ సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

లియోగా ఎంటరైన విజయ్:కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'లియో'. యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

Vijay Starrer LEO Movie High Quality print Leaked Online For Free Download

రికార్డులు బ్రేక్ చేసిందిగా:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'లియో' మూవీ ఆరభంలోనే అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇది భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రికార్డు కలెక్షన్లతో ఈ సినిమా సత్తాను చాటుకుంది.

అలాంటి టాక్.. భారీగానే:పూర్తి స్థాయి యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'లియో' ఈరోజే విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకు మొదటి రోజే రూ. 100 కోట్లు గ్రాస్‌ మార్కును చేరుకునే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Vijay Starrer LEO Movie High Quality print Leaked Online For Free Download

ఆన్‌లైన్‌లో లీకైన మూవీ:విజయ్ నటించిన 'లియో' మూవీ ఎన్నో అంచనాలతో, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయినట్లు తెలుస్తోంది.

ఆ ట్వీట్‌తో మేటర్ లీక్:తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ జర్నలిస్టు కమ్ క్రిటిక్ 'లియో' మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు ట్వీట్ చేశారు. అందులో ఆయన 'లియో మూవీ హై క్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. షాకింగ్ షాకింగ్ షాకింగ్' అంటూ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారిపోయింది. దీంతో చాలా మంది సినిమా లింక్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.

Vijay Starrer LEO Movie High Quality print Leaked Online For Free Download

నిజమైతే పెద్ద దెబ్బేగా:సుదీర్ఘ కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న ఎన్నో సంస్థలు భారీ నుంచి చిన్న తరహా సినిమాలను సైతం విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'లియో' మూవీని కూడా లీక్ చేసినట్లు పైన పేర్కొన్న ట్వీట్‌ను బట్టి అర్థం అవుతోంది. దీని ప్రభావం విజయ్ మూవీ కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X