LEO: విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. లియో మూవీ షోలు అన్నీ క్యాన్సిల్.. భగవంత్ కేసరికి లక్కీ ఛాన్స్

తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న బడా స్టార్ హీరోల్లో ఇళయదళపతి విజయ్ ఒకడు. సుదీర్ఘ కాలంగా అక్కడి ఆడియెన్స్‌ను తనదైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే, గత చిత్రంతో ఆశించిన హిట్‌ను అందుకోలేకపోయిన ఈ కోలీవుడ్ స్టార్.. ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం ఇప్పుడు విజయ్ 'లియో' అనే సినిమాను చేశాడు. ఈ చిత్రానికి విడుదలకు ముందు బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!

గతంలో 'మాస్టర్' వంటి బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రమే 'లియో'. హిట్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

Vijay Starrer LEO Movie IMAX Format Premiere shows Cancelled

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు అతి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై ఉన్న అంచనాలన్నీ మరింతగా పెరిగిపోయాయి. ఫలితంగా ఈ చిత్రం మరింత ఎక్కువ రేంజ్‌లో విడుదల కాబోతుంది. ఇక, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వీటికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కిన 'లియో' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే యూఎస్ సహా చాలా ప్రాంతాల్లో ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌ను సైతం అత్యధిక లొకేషన్లలోనే రిలీజ్ చేయబోతున్నారు.

నార్త్ అమెరికాకు సంబంధించిన 'లియో' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ను చాలా రోజుల క్రితమే ఓపెన్ చేశారు. అక్కడ ఇళయదళపతి విజయ్ సినిమాకు ఊహించని రీతిలో హైప్ ఏర్పడడంతో టికెట్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే చాలా టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరడానికి చేరువగా వచ్చేసింది.

Vijay Starrer LEO Movie IMAX Format Premiere shows Cancelled

'లియో' అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకోబోతుండగా.. ఓవర్సీస్‌లో ఈ మూవీకి బిగ్ షాక్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం.. అక్కడ అక్టోబర్ 18న వేసే ఐమ్యాక్స్ వెర్షన్ ప్రీమియర్ షోలు మొత్తం క్యాన్సిల్ అయ్యాయి. దీనికి కారణం ఈ కాపీ ఇంకా రెడీ కాకపోవడమే అని తెలిసింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తున్నారని టాక్.

ఇక, ఓవర్సీస్‌లో విజయ్ 'లియో' మూవీ షోలు క్యాన్సిల్ అవడంతో.. ఇది నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉండబోతుంది అన్న చర్చ కూడా నడుస్తోంది. అదే జరిగితే బాలయ్యకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇదిలా ఉండగా.. విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా నటించాడు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X