LEO: 4 నిమిషాలకే 10 కోట్లు.. ఇండియాలో ఫస్ట్ టైం అలా చేస్తున్న విజయ్

సౌతిండియా మొత్తంలోనే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. ఈ తమిళ హీరో విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోన్నాడు.

దీనికితోడు హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్నాడు. అలాగే, తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు విజయ్ 'లియో' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీలో నటిస్తున్నాడు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

Vijay Starrer LEO Movie Team Spent Rs 10 Crore for 4 Minutes Scene

గతంలో 'మాస్టర్' వంటి బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటిస్తోన్న చిత్రమే 'లియో'. హిట్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'లియో' మూవీలో 'హైనా ఫైట్' మేజర్ హైలైట్‌గా నిలవబోతుందట. ఇది హీరో ఇంట్రడక్షన్‌ సమయంలో వస్తుందని తెలిసింది. ఇందులో ఇళయదళపతి విజయ్ హైనా (జంతువు)తో ప్రాణాలకు తెగించి ఫైట్ చేస్తాడట. ఈ సీక్వెన్స్ ఇండియాలో ఇప్పటి వరకూ చూపించని విధంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది.

కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేస్తున్న ఈ సీన్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సీన్ కేవలం 4 నిమిషాలే ఉంటుందట. అయినా అంత ఖర్చు చేస్తున్నారంటే... ఈ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ న్యూస్ లీకైన తర్వాత అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక, ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X