'అత్తారింటి..' తమిళ రీమేక్ కి రంగం సిద్దం
రీమేక్ చిత్రాల హీరోగా పేరు పొందిన ఇలయ తలబది విజయ్ మరో విజయవంతమైన చిత్రం 'అత్తారింటికి దారేది' రీమేక్ చేయటంతో ఆయన తన క్రేజ్ పెంచుకునేందుకు చూస్తున్నారు. ఆయన కెరీర్‌లోని గిల్లీ, పోక్కిరి, కావలన్, బద్రీ, వేలాయుధం వంటి భారీ విజయాలన్నీ రీమేక్‌లే కావటం విశేషం. ప్రస్తుతం 'జిల్లా'లో నటిస్తున్న విజయ్ తాజాగా టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చిత్రం చేస్తాననటంతో ట్రేడ్ వర్గాల్లో సైతం చాలా హిట్ గ్యారెంటీ అని, విజయ్ కు రీమేక్ లే అచ్చి వచ్చాయంటున్నారు.,
గతంలో పవన్‌కల్యాణ్ నటించిన 'తమ్ముడు' రీమేక్ 'బద్రీ'లో నటించి విజయాన్ని అందుకున్నాడు విజయ్. అంతే కాకుండా ఇటీవల పోక్కిరి, వేలాయుధం తదితర తెలుగు కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సెంటిమెంటుతోనే 'అత్తారింటికి దారేది' రీమేక్‌లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












