అతిధి పాత్రకు మోహన్‌లాల్‌ ఖరారు!

By Srikanya

చెన్నై: రీసెంట్ గా తుపాకి చిత్రంతో తెలుగువారిని పలకరించిన 'ఇలయ తలబది' విజయ్‌ తాజాగా ఓ కొత్త చిత్రం కమిటయ్యారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తళుక్కున మెరవనున్నాడు. విజయ్‌ కేరళలోనూ పెద్దసంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన తాజా చిత్రం 'తుపాకి' అక్కడా వసూళ్లవర్షం కురిపిస్తోంది. విజయ్‌ కొత్త సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుతం 'దైవ తిరుమగళ్‌' ఫేమ్‌ విజయ్‌ దర్శకత్వంలో 'ఇలయ తలబది' నటించనున్న ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభమైంది. మోహన్‌లాల్‌ కనిపించనుంది ఇందులోనే నటిస్తాడంటున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం అప్పుడే నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. తుపాకి చిత్రం తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్నా రెవిన్యూ పరంగా పెద్దగా వర్కవుట్ కాలేదని ట్రేడ్ టాక్. విజయ్ కి ఇక్కడ మార్కెట్ లేకపోవటమే కారణమంటున్నారు.

విజయ్‌ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ' . ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్‌ లీగ్‌ కట్చి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చెన్నై నీలాంగరైలో ఆందోళన చేపట్టారు.

హీరో విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కపాలీశ్వరన్‌ వీధిలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు 65 మందిని అరెస్టు చేశారు. నీలాంగరై, వడపళనిలోని విజయ్‌ ఇళ్లకు నగర పోలీసులు గట్టి భద్రత కల్పించారు. అడయారులోని విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌, విరుగంబాక్కంలోని దర్శకుడు మురుగదాస్‌ ఇంటికి కూడా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లను ముట్టడిస్తామని ఇండియా నేషనల్‌ లీగ్‌ కట్చి అధ్యక్షుడు జవహర్‌ అలీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X