విజయ్ తలైవా శేఖర్ కమ్ముల లీడర్?
తలైవా గురించి పొంగళ్ కానుకగా ప్రకటన చేశారు. చిత్రం పోస్టర్లను కొన్నింటిని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ అదిరిపోయేట్లు ఉంది. చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేసే స్టిల్‌లో విజయ్ కనిపిస్తున్నాడు. విజయ్ కొత్త చిత్రం పేరు తలైవా అని ఓ ప్రకటనలో తెలిపారు.
విజయ్ తలైవా రాణా దగ్గుబాటి నటించిన లీడర్ తెలుగు చిత్రానికి రీమేక్ అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ తాజా తలైవా చిత్రం విజయ్ రాజకీయ రంగ ప్రవేశ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుందని అంటున్నారు.
చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రెండు పాటలను, మూడు ఫైట్లను ముంబైలో చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ స్పెయిన్‌లో జరుగుతుందని అంటున్నారు. డిసెంబర్‌లో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం 2013 మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. అమలా పాల్, సత్యరాజ్, శంతనం, సురేష్, మనో బాల, అభిమన్యు, తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చంద్ర ప్రకాష్ జైన్ నిర్మాత.


Click it and Unblock the Notifications












