'తుపాకీ' డబ్బింగ్ రైట్స్ రేటు అంతా..?
న్నై : విజయ్, కాజల్ జంటగా తమిళంలో రూపుదిద్దుతున్న ఓ చిత్రం తెలుగులో 'తుపాకీ' పేరుతో అనువదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనూవాద హక్కులు కి 15 కోట్లు చెల్లించినట్లు వినపడుతోంది. ఈ రేటు విన్న వారు షాక్ అవుతున్నారు. అయితే తెలుగులో సూర్య,కార్తి,రజనీకాంత్,కమల్ హాసన్ వంటి స్టార్స్ కు తప్ప మిగతా వారికి అంత సీన్ లేదని,ముఖ్యంగా విజయ్ సినిమాలు ఇప్పటివరకూ అస్సలు ఆడలేదు కాబట్టి అది నిజం కావచ్చుని అంటున్నారు.
అయితే ఈ చిత్రానికి ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు కావటం క్రేజ్ తీసుకు వచ్చింది. ఈ సినిమాను . ఎస్.వి.ఆర్ మీడియా సంస్థ తెలుగు హక్కులు పొందింది. నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ''ముంబయి నేపథ్యంగా నడుస్తుందీ చిత్రం. తుపాకీ కథాకమామీషు ఉత్కంఠభరితంగా ఉంటుంది. సాంకేతికంగా ఉన్నతస్థాయిలో నిర్మితవుతోంది'' అన్నారు. ఈ చిత్రంలో ఎ.ఆర్.మురుగదాస్ స్పెషల్ అప్పియరెన్స్ చేస్తారని సమాచారం. భారీ బడ్జెట్‌తో, ఉత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అలాగే "గట్టి పోటీ మధ్య మేం ఈ హక్కులను సొంతం చేసుకున్నాం. ఫ్యాన్సీ రేట్‌కు ఒప్పుకుని రైట్స్ పొందాం. మురుగదాస్ లాంటి విజన్ ఉన్న దర్శకుడు విజయ్, కాజల్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తప్పకుండా యువతకు నచ్చుతుంది. అన్ని వర్గాల వారినీ మెప్పిస్తుంది'' అన్నారామె. విద్యుత్ జమ్‌వాల్, జయరామ్, సత్యన్, అక్షర గౌడ, అనుపమ కుమార్, ప్రశాంత్ నాయర్, దీప్తి నంబియార్, గౌతమ్ కురూప్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, కెమెరా: సంతోష్ శివన్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్.


Click it and Unblock the Notifications











