మాది అద్బుత జంట:త్రిషా
తమిళ సినిమా రంగంలో సూర్య, అసిన్ జంటలాగా విజయ్, త్రిషాల జంట కూడా తెరపై అద్భుత జంటగా రాణించింది. సూర్య, అసిన్ లు హీరోహీరోయిన్లుగా వచ్చిన గజిని సినిమా సంచలన సినిమాగా రికార్డు సృష్టించగా విజయ్, త్రిషాలు జంటగా రూపొందిన ఇలయదళపతి సినిమా కూడా అంతే సంచలన విజయం సాధించింది. గజిని సినిమా తరువాత సూర్య, అసిన్ లు జంటగా నటించిన దేవా సినిమా ప్రస్తుతం తెలుగులోనూ ప్రదర్శతమవుతోంది.
విజయ్, త్రిషాలు కూడా ఇపుడు మరో సినిమా కోసం జత కట్టారు. మధ్యలో కొంతకాలం వీరిద్దరి మధ్య పొసగని సంగతి తెలిసిందే. త్రిషా హీరోయిన్ గా ఉంటే తాను నటించనని మొండికేసిన విజయ్ ను సైతం త్రిషా ఒప్పుకునేలా చేసింది. ఆ సినిమాయే ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న కురవి. ఎలాగూ తన సరసన నటించడానికి ఒప్పుకున్నాడన్న ధీమాతో కావచ్చు త్రిషా ఇపుడు స్టేట్ మెంట్లు ఇస్తోంది. తమ జంట ఎంతో చక్కనైన జంట అంటూ గారాలు పోతోంది. విజయవంతమైన జంట కూడా అంటోంది. విజయ్ ఎంతో అద్భుతమైన వ్యక్తి అంటోంది.


Click it and Unblock the Notifications











