మరో యువ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్

మాస్టర్ సినిమాతో సంక్రాంతికి విజయ్ పరవలేదనిపించే విదంగా కలెక్షన్స్ అయితే రాబట్టాడు. తెలుగులో పెట్టిన పెట్టుబడికి బయ్యర్లకు సినిమా మంచి వసూళ్లను అంధించింది. అయితే ఇటీవల కాలంలో తలపతి విజయ్ సీనియర్ దర్శకుల కంటే ఎక్కువగా యువ దర్శకులతోనే సినిమా చేస్తున్నాడు. మాస్టర్ సినిమాను ఖైదీ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా తరువాత నెల్సన్ దిలీప్ కుమార్ అనే మరో యువ దర్శకుడితో 65వ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అయితే ఆ సినిమా అనంతరం విజయ్ మరొక యువ దర్శకుడిని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. కార్తితో ఖాకీ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వినోథ్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 Vijay upcoming movie with another young director

ఈ దర్శకుడు పింక్ కథను అజిత్ తో తమిళ్ లో రీమేక్ చేసి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. అలాగే అజిత్ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా అనంతరం విజయ్ తో కొత్త సినిమాను సెట్స్ పైకి తెచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అసలైతే సర్కార్ తరువాతే ఈ దర్శకుడితో సినిమా చేయాల్సిందే. కానీ అతను చెప్పిన కథ పొలిటికల్ కాన్సెప్ట్ కావడంతో వెంటనే మళ్ళీ సర్కార్ తరహాలో పొలిటికల్ కథను చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యారట. ఇక మొత్తానికి వచ్చే ఏడాది ఆ కథను సెట్స్ పైకి తెచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X