చిన్న హీరోతో చేయాల్సిన సినిమా స్టార్ హీరో వద్దకు.. మాస్టర్ ప్లాన్
కొన్ని సినిమా కథలు సెట్స్ పైకి రాకముందు చాలా మంది హీరోల ను టచ్ చేసుకుంటూ రావడం చాలా కామన్. ఒకరికి నచ్చని కథ మరొకరికి నచ్చుతుంది. ఇండస్ట్రీలో ఇలాంటివి రోజు జరుగుతుండేవే. అయితే ఇటీవల ఒక మీడియం హీరో చేయాల్సిన కథ అనుకోకుండా అగ్ర హీరో దగ్గరకు వెళ్ళింది. కోలీవుడ్ మీడియాలో అందుకు సంబంధించిన రూమర్స్ చాలానే వైరల్ అవుతున్నాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే మాస్టర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 150కోట్ల వసూళ్లను అందుకున్న విజయ్ నెక్స్ట్ సినిమాతో అంతకంటే హై రేంజ్ లో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ కు చెప్పిన కథను ముందే ఈ దర్శకుడు మరో హీరోతో చేయాలని అనుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు. శివకార్తికేయన్.

దిలిప్ కూడా శివకార్తికేయన్ ను దృష్టిలో ఉంచుకొని కథను రాసుకున్నాడట. అయితే ఆ తరువాత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ కథ విజయ్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని అతని స్టైల్ కు తగ్గట్లుగానే మార్చాలని వివరణ కోరడంతో దిలీప్ మళ్ళీ స్క్రిప్ట్ ను మార్చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే విజయ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా సినిమాను రూపొందించనున్నారట. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











